దేశం పట్ల బాధ్యతల నిర్వహణలో ఎన్సిసి శిక్షణ :మోదీ

న్యూఢిల్లీ  ముచ్చట్లు:
 
దేశం పట్ల తన బాధ్యతలను నిర్వర్తించేందుకు అమితమైన బలం తనకు ఎన్సిసిలో పొందిన శిక్షణ వల్ల లభిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. శుక్రవారం న్యూఢిల్లీలోని కరియప్ప మైదానంలో జరిగినఎన్సిసిర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎన్సిసిగణతంత్ర దినోత్సవాల శిబిరం ముగింపు సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 28న ఈ ర్యాలీ జరుగుతుంది. మోదీ మాట్లాడుతూ, ‘‘మీలాగే నేను కూడా ఒకప్పుడు చురుకైన ఎన్సిసి కేడెట్‌నని చెప్పడం గర్వంగా ఉంది. ఎన్సిసిలో నేను పొందిన శిక్షణ, నేర్చుకున్న విషయాలు, దేశం పట్ల నా బాధ్యతలను నిర్వర్తించడంలో నేడు నేను అద్భుతమైన శక్తిని పొందుతున్నాను’’ అన్నారు. స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా అమృత మహోత్సవాలను దేశం జరుపుకుంటోందన్నారు. అటువంటి సమయంలో జరుగుతున్న ఈ సంబరాలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. కరియప్ప మైదానంలో తాను అటువంటి ఉత్తేజాన్ని చూస్తున్నానని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్సిసి (నేషనల్ కేడెట్ కాప్స్) ర్యాలీలో సిక్కు కేడెట్ తలపాగాను ధరించారు. ఎర్రని ఈకలతో అలంకరించిన రైఫిల్-గ్రీన్ తలపాగాను ధరించారు. కేడెట్ల కవాతును సమీక్షించి, గార్డ్ ఆఫ్ ఆనర్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తమ కేడెట్లకు పతకాలు, బ్యాటన్లను బహూకరించారు. స్వాతంత్ర్య దినోత్సవాలు, గణతంత్ర దినోత్సవాల్లో ప్రధాని మోదీ ధరించే తలపాగాలు గొప్పగా ప్రచారమవుతున్నాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాల్లో ఉత్తరాఖండ్ సంప్రదాయ తలపాగాను ధరించారు. ఆ రాష్ట్ర పుష్పం బ్రహ్మకమలం చిత్రంతో కూడిన ఈ తలపాగా ఆకర్షణీయంగా కనిపించింది. అదేవిధంగా మణిపూర్‌లో ప్రసిద్ధమైన అంగ వస్త్రాన్ని కూడా ధరించారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ శాసన సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
 
Tags: NCC training in managing responsibilities towards the country: Modi

Natyam ad