బందరు పోర్టుకు కొత్త డీపీఆర్

మచిలీపట్నం ముచ్చట్లు:
 
బందరు పోర్టు నిర్మాణానికి ఎపి మారిటైం బోర్డు నాలుగుసార్లు గడువు పొడిగించినా కాంట్రాక్టు సంస్థలు టెండరు దాఖలు చేసేందుకు ముందుకు రాలేదు. ఈ క్రమంలో షరతులు సవరించి మరోసారి టెండర్లు పిలవాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఈ ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డిపిఆర్‌)లో మార్పులు చేర్పులు సూచిస్తూ కన్సల్టెన్సీ సంస్థ రైల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (రైట్‌) నుండి నివేదిక కోరింది. దీనిపై మచిలీపట్నం పోర్టు కార్యాలయం, మచిలీపట్నం అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ (ముడ), రైట్‌ సంస్థ మరోసారి కసరత్తు చేస్తున్నాయి.పోర్డు నిర్మాణానికి మొత్తం రెండు వేల ఎకరాలు భూమి అవసరం. దీనిలో కొంతమేర ప్రభుత్వ భూమి ఉంది. రూ.168 కోట్లు ఖర్చు చేసి బందరు రూరల్‌ మండలంలోని సమీప గ్రామాల్లో 639 ఎకరాలను ముడ కొనుగోలు చేసింది. పోర్టు అవసరాలతో పాటు రైల్‌, రోడ్డు కనెక్టవిటీకి మరో 123 ఎకరాలు, పోర్టు నిర్మాణానికి పూలింగ్‌కు ఇచ్చిన 537 ఎకరాలను కొనుగోలు చేయాల్సి ఉంది.గతంలో మినరల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఎపి నుండి రూ.200 కోట్లు రుణంగా తీసుకుని కొంత మేర భూసేకరణ చేశారు. ఈ నిధుల్లో ఇంకా రూ.13 కోట్లు మిగిలి ఉన్నాయి. మినరల్‌ కార్పొరేషన్‌ అప్పు తీర్చడానికి, పోర్టుకు అవసరమైన భూమిని పూర్తిస్థాయిలో సేకరించేందుకు రూ.547 కోట్లు సమకూర్చాలని ముడ నివేదిక సిద్ధం చేసింది.పూర్తిస్థాయిలో పోర్టు నిర్మాణానికి రూ.5,834 కోట్లు అవసరమని కన్సల్టెన్సీ సంస్థ డిపిఆర్‌లో పొందుపరిచింది. తొలిదశలో బ్రేక్‌ వాటర్‌ పద్ధతిలో నాలుగు బెర్త్‌ల నిర్మాణానికి, నావిగేషన్‌ ఛానళ్లు, ప్లోటింగ్‌ క్రాఫ్ట్‌ల నిర్మాణం, పోర్టు అభివద్ధికి రూ.1860 కోట్లు అవసరమని రైట్‌ సంస్థ డిపిఆర్‌లో పేర్కొంది. టెండరు షరతుల్లో మార్పులకు అనుగుణంగా ఈ అంచనాలను మారుస్తున్నారు.
 
Tags;New DPR for port

Natyam ad