“వాట్స‌ప్‌”ల‌తో స‌రికొత్త ఆరోగ్య స‌మ‌స్య‌లు

Date:14/02/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
జీహెచ్ఎంసీ అధికారులు ప్ర‌తి గంట స‌మ‌యంలో దాదాపు 45 నిమిషాల పాటు వాట్స‌ప్ గ్రూపుల స‌మాచారాన్ని చ‌ద‌వ‌డం, తిరిగి స‌మాచారాన్ని, ఆదేశాల‌ను టైప్ చేస్తూ విధుల‌ను నిర్వ‌ర్తించ‌డం వ‌ల్ల స‌రికొత్త ఆరోగ్య‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు కూడా ఎదుర‌వుతాయ‌ని జీహెచ్ఎంసీ అధికారులు వాపోతున్నారు. అదేప‌నిగా మొబైల్‌లో వాట్స‌ప్ స‌మాచారాన్ని చూడ‌డం వ‌ల్ల అత్యంత సున్నితంగా ఉండే మెడ న‌రాల‌పై తీవ్ర ఒత్తిడి భారం ప‌డి మెడ‌నొప్పులు, త‌ల పార్శ‌పు నొప్పులు, భుజంతో పాటు ఒక వైపు శ‌రీరం తీయ‌డం త‌దిత‌ర ఆరోగ్యప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయ‌ని అంటున్నారు. కంటి సంబంధ‌మైన స‌మ‌స్య‌లు కూడా త‌లెత్త‌నున్నాయ‌ని అధికారులు తెలిపారు.వాట్స‌ప్ సందేశాల‌ను నిరంత‌రం చ‌ద‌వ‌డం, త‌గు అదేశాలు, పంపించే విష‌యంలో అధిక మొత్తం స‌మ‌యాన్ని వెచ్చించే అధికారులు చిన్న చిన్న జాగ్రత్త‌లు తీసుకోవ‌డం ద్వారా స‌మ‌స్య‌ల నుండి దూరం కావ‌చ్చ‌ని న్యూరో ఫిజిషియ‌న్ వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాట్స‌ప్‌ను క్రింది భాగంలో ఉంచిచూడ‌డం కాకుండా 90 డిగ్రీల ఎత్తుపై నిటారుగా  చూడాలని త‌ద్వారా మెడ న‌రాల‌పై భారం త‌గ్గుతుంద‌ని అంటున్నారు. దీంతో పాటు త‌ల‌కు సంబంధించి చిన్న చిన్న ఎక్స‌ర్‌సైజులు ప్ర‌తిరోజు మూడు సార్లు చేస్తే కూడా ఆరోగ్య‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని పేర్కొంటున్నారు. కార్యాల‌యంలో ఉన్న‌ప్పుడు త‌మ కంప్యూట‌ర్ల ద్వారా వాట్స‌ప్‌ల‌ను చూసే అల‌వాటు చేసుకోవాల‌ని పేర్కొన్నారు. అధిక స‌మాచారం వాట్స‌ప్‌ల‌ను చూసే అధికారులు, సిబ్బంది త‌ప్ప‌నిస‌రి న్యూరో ఫిజిషియ‌న్‌ల‌ను సంప్ర‌దించి త‌గు ఆరోగ్య సూత్రాల‌ను పాటించాల‌ని డాక్ట‌ర్లు స్ప‌ష్టం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ లాంటి ప్ర‌తి పెద్ద కార్యాల‌యాల్లో నిరంత‌రం వాట్స‌ప్‌ల ద్వారా ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించే అధికారుల‌కు ప్ర‌త్యేక వైద్య శిబిరాల‌ను కూడా ఏర్పాటు చేయాల‌ని సూచిస్తున్నారు.
Tags: New health issues with “Watsup”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *