తవ్వే కొద్ది సెక్స్ రాకెట్ లో కొత్త అంశాలు

Date:19/06/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
హీరోయిన్లకు అభిమానులు నీరాజనాలు పలుకుతారు. సినిమా హీరోయిన్లు ఏదైనా షాప్ ఓపెన్ చేస్తేనే వేలాది మంది అభిమానులు వస్తుంటారు. ఇక హీరోయిన్లతో ఏదైనా ప్రోగ్రాం ఉందంటే ఆ హడావిడి మామూలుగా ఉండదు. అవకాశాలు లేని హీరోయిన్లు సెక్స్ రాకెట్లో చిక్కుకున్న వాళ్లు ఎందరో. హీరోయిన్లకు ఉన్న క్రేజ్ తో అమెరికాలో సైతం స్టార్ నైట్ పేరుతో సెక్స్ రాకెట్లు నడుపుతున్న వారిపై అమెరికా పోలీసులు ఉక్కుపాదం మోపారు. చికాగోలో గుట్టురట్టయిన సెక్స్ రాకెట్. మన దేశంలో సినిమా నటులతో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించే సెక్స్ రాకెట్లను పోలీసులు ఎప్పటికప్పుడు గుట్టు రట్టు చేస్తూనే ఉన్నారు. అయినా హీరోయిన్లకు ఉన్న క్రేజ్ తో విటులు ఎంత డబ్బునైనా చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు.ఇక విదేశాల్లో ఉంటున్న వారైతే హీరోయిన్లతో నిర్వహించే స్టార్ నైట్ ప్రోగ్రాం లకి కిక్కిరిసిపోతుంటారు. దీన్ని ఆసరా చేసుకున్న నార్తర్న్ అమెరికా ఇల్లినాయిస్ లో స్థిరపడ్డ ఓ తెలుగు కుటుంబం ఇండియన్ హీరోయిన్లతో సెక్స్ రాకెట్ కు తెర తీసింది.అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వాళ్లకు సినిమా హీరోయిన్లపై ఉన్న మోజును క్యాష్ చేసుకోవాలనుకున్నారు. ఇల్లినాయిస్ లో నివాసముంటున్న కిషన్ మోదుగుమూడి,చంద్రకళ మోదుగుమూడి కమర్షియల్ సెక్స్ రాకెట్ మొదలుపెట్టారు. తెలుగు అసోసియేషన్ సౌథర్న్ కాలిఫోర్నియా తరఫున స్టార్ నైట్ నిర్వహిస్తున్నామంటూ ప్రచారం ప్రారంభించారు. తెలుగు అసోసియేషన్ స్టార్ నైట్ పేరుతో తెలుగు, కన్నడ, తమిళ హీరోయిన్లకు ఆరు నెలల నుంచి ఏడాది గడువుండే బీ వన్, బీ టూ విజిట్ వీసాలు ఇప్పించారు. గతేడాది 2017 నవంబర్ 20వ తేదీన స్టార్ నైట్ పేరుతో ఢిల్లీ, ముంబై నుంచి ఇద్దరు పేరున్న హీరోయిన్లు అమెరికాలోని ఒహరే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. మరికొద్ది రోజుల తర్వాత జూనియర్ ఆర్టిస్టులు సైతం విజిట్ వీసాలతో ఇల్లినాయిస్ చేరుకున్నారు. చికాగోలో వీరందరికీ కిషన్, చంద్రకళ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఏర్పాటు చేశారు.: కిషన్ మోదుగుమూడి,చంద్రకళ మోదుగుమూడి కొత్త పేర్లతో హీరోయిన్లతో సెక్స్ రాకెట్ నిర్వహించారు. కిషన్ మోదుగుమూడి శ్రీరాజ్ చెన్నుపాటి,రాజు పేర్లతో…. చంద్రకళ మోదుగుమూడి వెబ,వెబా జయం, విభా జయం పేర్లతో విటులకు ఇండియన్ హీరోయిన్లు ఉన్నారంటూ మెయిల్ పంపి ఆకర్షించారు. కొందరికేమో ఫోన్లు చేసి ఆకట్టుకున్నారు. చికాగో కేంద్రంగా ఇండియన్ హీరోయిన్లతో కమర్షియల్ సెక్స్ రాకెట్ నడుస్తున్నట్టు ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఏజెంట్ బ్రియాన్ గిన్ కు ఫిర్యాదు అందింది. దీంతో ప్రత్యేక నిఘా పెట్టిన బ్రియాన్ గిన్ ట్రావెల్, హోటల్ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కిషన్, చంద్రకళ వాడిన ఫోన్ రికార్డులు… మారు పేర్లతో సాగించిన సెక్స్ రాకెట్ తీరు…వ్యభిచారానికి పాల్పడ్డ హీరోయిన్ల వివరాలు సేకరించారు. పక్కా ఆధారాలతో కిషన్, చంద్రకళ పై టైటిల్ 8 యునైటెడ్ స్పెషల్ కోడ్ 1328 కింద కేసు నమోదు చేశారు.
Tags:New items on a small rocket

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *