ఏపీ ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్.

విజయవాడ ముచ్చట్లు :
ఏపీ ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల కారణంగా ఇంటర్ ఎగ్జామ్స్‌ను పోస్ట్‌పోన్ చేశామని ఆయన అన్నారు. ఇక రిలీజ్ చేసిన కొత్త షెడ్యూల్ ప్రకారం.. రాష్ట్రంలో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 12 తేదీ వరకు జరగనున్నాయి. ఫస్టియర్ పరీక్షలు ఏప్రిల్ 22, 25, 27, 29, మే 2, 6, 9, 11 తేదీల్లో జరగనుండగా.. సెకండియర్ పరీక్షలు ఏప్రిల్ 23, 26, 28, 30, మే 05, 07, 10, 12 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇక ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం గతంలో ప్రకటించినట్టుగానే మార్చి 11 తేదీ నుంచి మార్చి 31 వరకు జరగనున్నాయి. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలను నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంటర్ బోర్డు తరపున అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. మొత్తం 1400 కేంద్రాలలో పరీక్షలు జరగనుండగా.. ల్యాబ్ ఎగ్జామ్స్ 900 కేంద్రాల్లో జరుగుతాయి.
 
Tags:New schedule of AP Inter exams

Natyam ad