New Year's gift to CM

దివ్యాంగులకు సీఎం కొత్త సంవత్సర కానుక

Date: 30/12/2017

హైదరాబాద్‌ ముచ్చట్లు:

వివాహం ప్రోత్సాహకాన్ని రూ.లక్షకు పెంపు

రాష్ట్రంలోని దివ్యాంగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నూతన సంవత్సర కానుక ప్రకటించారు. దివ్యాంగులను వివాహం చేసుకుంటే ఇచ్చే ప్రోత్సాహకాన్ని పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సంబంధిత ఫైలుపై కేసీఆర్ శుక్రవారం సంతకం చేశారు. ప్రోత్సాహకాన్ని రూ.50 వేల నుంచి రూ. లక్షకు పెంచారు. వికలాంగుడైన అబ్బాయిని అమ్మాయి వివాహమాడినా లేక వికలాంగురాలైన అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకున్న ఈ పథకం వర్తిస్తుంది. దీంతో పాటు కల్యాణలక్ష్మి పథకం కూడా దివ్యాంగులకు వర్తించనుంది. ఉదాహరణకు దివ్యాంగులకు ఇచ్చే ప్రోత్సాహకం రూ. లక్ష అయితే కల్యాణలక్ష్మి పథకం ద్వారా వచ్చే రూ. 71 వేలతో కలిపి మొత్తం రూ. లక్షా 71 వేలు లబ్ధిపొందుతారు.

Tag: New Year’s gift to CM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *