ఇద్దరు భార్యలకు నిప్పుపెట్టాడు

Date:20/12/2017

జయపుర ముచ్చట్లు:

తన తల్లిని సంతోషపెట్టడంలేదని ఇద్దరు భార్యలను దారుణంగా చంపేశాడు ఓ భర్త. ఈ దారుణ ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. దీపా రామ్ అనే వ్యక్తి దరియా దేవి, మాలి దేవి అనే ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నాడు.మంగళవారం బంగారం కొనిస్తానని వారిని కారులో తీసుకెళ్లిన రామ్.. తన తల్లి విషయంలో ఇద్దరు భార్యలతో గొడవపడ్డాడు. వారిలో ఒకరు కారు దిగి సాయం కోసం అరుస్తుండగా బలవంతంగా కారులోకి తోసి వాహనానికి నిప్పుపెట్టాడు. దాంతో ఇద్దరూ కారులోనే సజీవదహనమయ్యారు. గుజరాత్లో కూలీగా పనిచేస్తున్న రామ్కి ముగ్గురుపిల్లలు ఉన్నారు.నేరం ఒప్పుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోవడంతో పోలీసులు అతన్ని రిమాండ్కు తరలించారు.

Tags:Nippupettadu two wives

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *