ముందే విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ

Date:15/02/2018
ముంబై ముచ్చట్లు:
పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు కుంభ‌కోణం సంబంధించి పోలీసులు ఇంకా కేసు న‌మోదు చేయ‌క‌ముందే నీర‌వ్ మోదీ స్విట్జ‌ర్లాండ్‌కు పారిపోయిన‌ట్లు స‌మాచారం. పీఎన్‌బీ కేసులో తీవ్ర నేరారోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నీర‌వ్ ఆయ‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌క‌ముందే భార‌త్‌ను విడిచి విదేశాల‌కు పారిపోయిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుత వివాదాన్ని సామ‌రస్యంగా ప‌రిష్క‌రించుకునేందుకు రూ.5000 కోట్లు బ్యాంకుల‌కు చెల్లిస్తామ‌ని ఆఫ‌ర్ ఇచ్చినట్లు మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. నీర‌వ్ మోదీ దేశాన్ని వదిలి పారిపోయిన‌ట్లు త‌మ వ‌ద్ద ఏ స‌మాచారం లేద‌ని హోం మంత్రిత్వ శాఖ వ‌ర్గాలు అంటున్నాయి. వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ విదేశాల‌కు వెళ్లిన‌ట్లు ఈడీ స్ప‌ష్టం చేసింది.రూ280 కోట్ల మోసం కేసుకు సంబంధించి నీర‌వ్ మోదీ చాలా ముందే జాగ్ర‌త్త‌గా విదేశాల‌కు వెళ్లిన‌ట్లు ఆర్థిక శాఖ వ‌ర్గాలంటున్నాయి. అయితే రూ.5000 కోట్ల‌ను తిరిగి బ్యాంకుల‌కు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్లు నీర‌వ్ మోదీ బ్యాంకుల‌కు రాయ‌బారం పంపిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రో వైపు నీర‌వ్ మోదీ, పీఎన్‌బీ కార్యాల‌యాల్లో ఈడీ సోదాలు నిర్వ‌హిస్తోంది. ముంబైలోని నీర‌వ్ మోదీ దుకాణాల్లో , పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు శాఖ‌ల్లో ఈడీ త‌న సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగిస్తున్న‌ట్లు స‌మాచారం.
Tags: Nirav Modi who had fled abroad before

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *