ఫ్లాష్‌…ప్లాష్‌… జనవరి ఫస్ట్ వద్దు – ఉగాధి ముద్దు ఆలయాల్లో – నూతన సంవత్సర వేడుకలకు ఫుల్‌స్టాప్‌

Date : 23/12/2017

అమరావతి ముచ్చట్లు:

నూతన ఇం ఘ్లీష్‌ సంవత్సరం జనవరి ఫస్ట్ను ఆలయాల్లో జరపరాదంటు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు ప్రజలుగా ఉంటు మార్చి నెలలో వచ్చే తెలుగు సంవత్సర ఉగాధిని జరుపుకోకుండ జనవరి ఫస్ట్ వేడుకలు నిర్వహించడంపై హిందూధర్మపరిరక్షణ సంఘం దేవాదాయశాఖకు ఫిర్యాదు చేసింది. దేవాలయాలలో నూతన సంవత్సర వేడుకలు ఆపివేసి, తెలుగుబాషా సంస్కతిని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టాలని కోరింది. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనర్‌ హుఠాహుఠిన ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఏ దేవాయాలలోను నూతన సంవత్సర అలంకారం చేయరాదని, వేడుకలు నిర్వహించరాదని, ఉగాధి రోజు మాత్రమే తెలుగు సంవత్సర వేడుకలు నిర్వహించాలని సూచించింది. ఈ ఉత్తర్వుల పట్ల హిందూవులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఉగాధి వేడుకలు 2018 నుంచి వైభవంగా జరుగుతుందనటానికి నిదర్శనమని కొనియాడారు.

Tags : No January first – in Ugadi kisses – New Year celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *