ఆందోళన వద్దు- అన్ని చర్యలూ తీసుకొంటున్నాం..

– ఉక్రెయిన్లోని విద్యార్థుల భద్రతపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ
– తల్లిదండ్రులు ధైర్యంతో ఉండాలి
-డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
శ్రీశైలం ముచ్చట్లు:
ఉన్నత చదువుల నిమిత్తం ఉక్రెయిన్‌ వెళ్లి రష్యాతో యుధ్దం కారణంగా అక్కడే చిక్కుకుపోయిన శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన విద్యార్థుల గురించి వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని వారిని సురక్షితంగా వెనక్కు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఉక్రెయిన్లో చదువుతున్న ఏపీ విద్యార్థుల రక్షణకు ఏర్పాట్లు చేయించడంతో పాటు అక్కడి నుంచి క్షేమంగా వారిని రప్పించడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారని, విదేశాంగ శాఖ మంత్రికి లేఖ కూడా రాశారని చెప్పారు. కేంద్రం కూడా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేసిందన్నారు. ఇప్పటికే ఏవీఎన్ఆర్డీఎస్ ద్వారా ఆయా విద్యార్థులకు కావలసిన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో నోడల్ అధికారిని, విదేశాంగ శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులకు వీలుగా ప్రత్యేక ప్రతినిధిని ఏర్పాటుచేశామని తెలిపారు. ఉక్రెయిన్లోని ఏపీ విద్యార్థులతో ఇప్పటికే నేరుగా మాట్లాడి వారికి ధైర్యం
చెప్పామన్నారు. అక్కడి భారత ఎంఐసీ కూడా విద్యార్థులకు అనేక సూచనలు అందించిందని, వాటి ప్రకారం నడచుకోవాలని తెలిపామన్నారు. సీఎం వైఎస్ జగన్ ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించారని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మీ పిల్లల్ని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఎవరూ ధైర్యాన్ని కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు.
 
Tags:No worries- we are taking all measures ..

Natyam ad