మనుషులు కాదు.. రాక్షసులు..

Date:18/06/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
అమెరికాలో టాలీవుడ్ యాక్టర్లు, యాంకర్లతో హైటెక్ వ్యభిచార దందా నిర్వహిస్తోన్న కిషన్, చంద్రల కేసులో మరిన్ని చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. కిషన్, చంద్రలు మనుషుల రూపంలోని రాక్షసులంటున్నవారి వాదనకు మద్దతుగా చికాగో పోలీసులు ఇంకొన్ని అంశాలు వెల్లడించారు. వారు చెప్పిన మాటల ప్రకారం.. కిషన్, చంద్ర.. అమెరికాలో ఈవెంట్ అంటూ వర్ధమాన నటీమణులకు వలవేస్తారు. హుషారుగా తమ వద్దకు వచ్చేయమంటారు. చాలాఅందంగా నటీమణులను ఆకర్షిస్తారు. ఇదంతా నిజమే అనుకుని.. నమ్మి వెళ్లిన వారికి అక్కడ నరకం చూపిస్తారు. మాటల్లో వర్ణించలేని అరాచకపర్వానికి తెర తీస్తారు. సెక్స్ రాకెట్ మాస్టర్ మైండ్స్ కిషన్, చంద్రల డైలీ డ్యూటీ ఇది. వర్ధమాన నటీమణులు, యాంకర్లకు వల వేయడం.. కాదూ కూడదంటే.. బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపడం వారి వృత్తి. ప్రస్తుతం ఈ కేసులో క్షణానికో వాస్తవం వెలుగుచూస్తోంది. సభ్యసమాజాన్ని నివ్వెరపరుస్తోంది. ఈవెంట్ల కోసం అమెరికా వెళ్లిన వర్ధమాన యాక్టర్లను కిషన్, చంద్రలు పెట్టే టార్చర్ వర్ణించాలంటే మాటలు వెతుక్కోవాల్సి పరిస్థితి. అమెరికాలో దిగిన వెంటనే నేరుగా.. కిషన్ ఇంటికి వెళ్తుంటారు నటీమణులు. వారికి ఆతిథ్యం ఇస్తున్నట్లే ఇచ్చి.. డబ్బు, పాస్ పోర్ట్ కాజేస్తారు. ఇక అక్కణ్ణుంచి తమలోకి రాక్షస ప్రదర్శనకు తెరతీస్తారు కిషన్, చంద్ర. తాము చెప్పిన మాట వినకపోతే జీవితం నాశనం చేస్తామని బెదిరిస్తారు. కస్టమర్లతో గడపాల్సిందేనని హుకుం జారీచేస్తారు. అయినప్పటికీ లొంగకపోతే.. విపరీతంగా కొడతారు. బాధితులను నగ్నంగా నిలబెట్టి ఫొటోలు తీస్తారు. తాము చెప్పినట్లు చేయకపోతే.. న్యూడ్ ఫొటోలు నెట్ లో పెడతామంటూ బెదిరిస్తారు.
కిషన్, చంద్రల టార్చర్ తట్టుకోలేక పలువురు నటీమణులు, యాంకర్లు… వ్యభిచార రొంపిలోకి దిగారు. ఇక ఇలాంటి వారిని వారు వేధించే తీరు అమానుషమనే చెప్పాలి. ముందుగా బుక్ చేసుకున్న ప్రకారం.. రోజులో పలువురితో బాధితులు వ్యభిచారం చేయాల్సి వచ్చేది. కావాల్సినంత దండుకున్న తర్వాత బాధితులకు పాస్ పోర్ట్ ఇచ్చేవారు. అమెరికాలో జరిగింది బయటకు చెప్తే ప్రాణాలు తీస్తామని బెదిరించేవారు. తాము చాలా పెద్దవాళ్లమని, కేసులు పెట్టినా ప్రయోజనం ఉండదని అనేవారు. తెగించి కంప్లైంట్ చేస్తే బాధితుల కుటుంబాలను సర్వనాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చేవారు. ఇండియా చేరుకున్నా బాధితులను వదిలేవారు కాదు కిషన్, చంద్ర. భారత్ లో ప్రముఖులు, రాజకీయనేతలతో డేట్స్ ఫిక్స్ చేసి వారి వద్దకు పంపేవారు. వెళ్లకపోతే.. అమెరికాలో ఉన్నప్పుడు షూట్ చేసిన నగ్న చిత్రాలు, వీడియోలు నెట్ పెడతామని బెదిరించేవారు. ఇక కస్టమర్లనూ ఇదే విధంగా వేధించేవారని విచారణలో తేలింది. అమ్మాయిలతో గడిపిన వీడియోలను చూపిస్తూ కస్టమర్లను బెదిరించేవారని.. తాము ఎంపిక చేసుకున్న వారితో మళ్లీ గడిపేలా బెదిరింపులకు పాల్పడేవారని పోలీసులు తేల్చారు.
Tags:Not human beings .. demons ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *