ఇంకా లెక్క తేలలేదు

Date:14/02/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కేంద్రం పెద్దనోట్లను రద్దు చేసి 15 నెలలై నా బ్యాంకులకు తిరిగొచ్చిన ఈ నోట్ల విలువ ఎంతనేది ఇంకా తేలలేదు. రద్దయిన పెద్దనోట్లు బ్యాంకులకు తిరిగొచ్చిన తర్వాత అవి కచ్చితంగా ఎన్ని ఉ న్నాయి, అందులో నకిలీవి, అసలు ఎంత అనే విషయాలు తెలుసుకొనే ప్రక్రియ కొనసాగుతున్నదని ఆర్బీఐ తెలిపింది. ఈ ప్రక్రియ వేగంగా నడుస్తున్నదన్నది. రద్దయిన నోట్లు ఎన్ని అని అడిగిన ప్రశ్నకు.. మొత్తం సరిచూస్తున్నాం, భవిష్యత్‌లో ఇంకేమైనా మార్పులు ఉండొచ్చు.. 2017 జూన్ 30 నాటికి బ్యాంకులు అందుకున్న రద్దయిన పెద్దనోట్ల విలువ రూ.15.28 లక్షల కోట్లు అని తెలిపింది. రద్దయిన పెద్దనోట్ల లెక్కింపును ఎప్పటిలోగా పూర్తిచేస్తారో సమాచారం ఇవ్వాలని కోరగా.. 59 అధునాతన నోట్ల పరిశీలన, ప్రాసెసింగ్ మెషిన్ల(సీవీపీఎస్)తో వేగంగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నదన్నది.ఇవే కాక వాణిజ్య బ్యాంకులు ఎనిమిది సీవీపీఎస్ యంత్రాలను వాడుతున్నాయి. మరో ఏడు యం త్రాలను లీజ్‌కు తీసుకొని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో పనిచేస్తున్నాం అని ఆర్టీఐ పిటిషన్‌దారు కు జవాబిచ్చింది. కేంద్రం 2016 నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేసి.. వాటిని బ్యాంకులకు తిరిగి ఇచ్చేయాలని ప్రత్యేకంగా అనుమతించిన అవసరాలకు వినియోగించాలని సూచించింది. గత ఏడాది ఆగస్టు 30న ఆర్బీఐ 2016-17 వార్షిక నివేదికలో.. రూ. 15.28 లక్షల కోట్లు లేదా 99% రద్దయి న పెద్ద నోట్లు బ్యాంకులకు చేరాయని.. ఇంకా రూ.16,050 కోట్లు మాత్రమే రావాలని పేర్కొన్నది.
Tags: Not yet calculated

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *