బీజేపీలో చేరిన ఎన్నారై

హైదరాబాద్ ముచ్చట్లు:
 
ఎన్ఆర్ఐ బాలా త్రిపురసుందరి గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సమక్షంలోఆమె  బీజేపీలో చేరారు. ఉమ్మడి మహా బూబ్ నగర్ జిల్లాజడ్చర్ల కు చెందిన బాల త్రిపుర సుందరి,  లండన్ లో  సాఫ్ట్వేర్ కంపెనీలో పలు హోదాల్లో విధులు నిర్వర్తించారు.  ఆమె గత కొన్ని సంవత్సరాల క్రితం స్వదేశానికి తిరిగి వచ్చి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు .  పలు సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  బీజేపీ సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు  బాలా త్రిపుర సుందరి చెప్పారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
 
Tags:NRIs who joined the BJP

Natyam ad