Number one in welfare: ketiar

సంక్షేమంలో నెంబర్ వన్ : కేటీఆర్

 Date:15/08/2018
రాజన్నల సిరిసిల్ల ముచ్చట్లు:
దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందని రాష్ర్ట ఐటిశాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మంత్రి కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్, వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు, టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు,  ఎస్పీ రాహుల్ హెగ్దె లు పాల్లొన్నారు.
పోలీసులగౌరవ వందనాన్ని మంత్రి  స్వీకరించారు. అనంతరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాంతంత్ర్య సమరయోధులను ఆయన శాలువతో సత్కరించారు. మంత్రి మాట్లాడుతూ దేశంలోనే 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కారేనన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రాన్ని 90 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్న ఆయన, కాళేశ్వరం 9, 10, 11, 12 ప్యాకేజీలతో పాటు ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి మొత్తం 2 లక్షల 4 వేల ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్నట్లు వెల్లడించారు. స్వచ్ఛత లో సిరిసిల్ల జిల్లాకు దేశ వ్యాప్త ఖ్యాతి లభించిందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు భీమా పథకం, రైతు బంధు వంటి పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. భూ రికార్డ్స్ ప్రక్షాళనలో కూడా సిరిసిల్ల రాష్ట్రంలోనే ముందంజ లో ఉందన్నారు. విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ కళశాల మైదానంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల శకటాల ప్రదర్శన జరిగింది.
Tags:Number one in welfare: ketiar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *