Oil painting during the Renaissance of Italy

ఇటలీ పునరుజ్జీవన కాలంలో ఆయిల్‌ పెయింటింగ్‌

Date: 08/01/2018

హైదరాబాద్‌ ముచ్చట్లు:

మొనాలిసా లియోనార్డో డావిన్సీ అనే ప్రముఖ ప్రాచీన చిత్రకారుడు చిత్రించిన ప్రఖ్యాతి గాంచిన చిత్రపటం. దీనిని 16వ శతాబ్దంలో ఇటలీ పునరుజ్జీవన కాలంలో ఆయిల్‌ పెయింటింగ్‌గా చిత్రించినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఇది నిస్సందేహంగా ప్రపంచంలో అత్యంత ఖ్యాతి గాంచిన చిత్ర పటమే.ఎందుకంటే మరే కళాఖండానికి ఇంతటి ప్రఖ్యాతి లభించలేదు. దీనిని గురించి ఎంతో మంది ఎన్నో పరిశోధనలు చేశారు. దీని మీద ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇది ఇప్పుడు ఫ్రెంచి ప్రభుత్వ స్వాధీనంలో ఉంది. లియొనార్డో డావిన్సి జననం ఏప్రిల్‌ 15, 1452 ? మరణం మే 2, 1519. ఇటలీకు చెందిన ఒక శాస్త్రజ్ఞుడు, గణితజ్ఞుడు, ఇంజనీర్‌, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్‌, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీతకారుడు, రచయిత. ఇతడు చిత్రీకరించిన చిత్రాలలో ప్రసిద్ది చెందినది మొనాలిసా చిత్రం. డావిన్సి తల్లిపేరు కాటెరిన్స్‌. 1469లో ఈయన తండ్రి ష్లోలెంన్స్‌ కు వెళ్ళీపోయారు. ఈ కారణంగా డావిన్సి కొంతకాలం పాటు బాబాయి వరస అయ్యే వ్యక్తి దగ్గర ఉండేవాడు. 14 ఏళ్ళ వయస్సు నాటికే మోడలింగ్‌లో డావిన్సి ఎంతో ప్రతిభ కనబరిచాడు. ఈయనను ఆండ్రియా డెల్‌ వెర్రాచివో శిల్పాచార్యునివద్ద చేర్చించాడు డావిన్సి తండ్రి.30 యేళ్ళ వరకు డావిన్సి ప్లోరెన్స్‌ లోనే ఉండి ఎన్నో విషయాలు తెలుసుకోగలిగారు. కాని ఆర్జన మాత్రం యేమీ ఉండేది కాదు. 1482లో డావిన్సి మిలాన్‌ రాజుకు తన గురించి తెలియ జెప్పుకున్నాడు. ఫలితంగా ఈయన మిలిటరీ ఇంజనీరింగ్‌ కాగలిగారు. ఎన్నో రకాల యుద్ధ పరికరాలను రూపొందించారు. రకరకాల ఆయుధాలను తయారు చేసాడు. ఈయన వీధులు, కాలవలు, చర్చిలు, గుర్రపు శాలలు, రాజ ప్రసాదారు- ఎలా ఉండాలో చెబుతూ వాటికి ప్లానులు వేసేవాడు. అంతేకాదు 1495లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన లాస్ట్‌ సప్పర్‌ చిత్రాన్ని మొదలుపెట్టి 1497లో పూర్తి చేశాడు. 1499లో డావిన్సి వెనిస్‌ నగరం చేరుకున్నాదు. అప్పుడు టర్కీతో యుద్ధం జరుగుతూ ఉండింది. ఆ యుద్ధ సమయంలో ప్రత్యర్థులను కొట్టడానికి కావలసిన సామాగ్రి గురించి, ఆత్మ రక్షణ కోసం ఉపయోగించవలసిన వస్తువుల గురించి, డావిన్సి ఎంతో విశదంగా తెలిపారు. కాని ఆయన ఆలోచనలు చాలా ఖర్చుతో కూడుకున్నవని ఆచరణలో పెట్టలేదు. ఖర్చు విషయం తప్పిస్తే ఈయన చెప్పినవాటికి ఏవీ సాటి రావని చెప్పవచ్చు. డావిన్సి 1500 లో మళ్ళీ ఫ్లోరెన్స చేరుకున్నాడు. 1503లో విశ్వ విఖ్యాతమైన మొనాలిసా పెయింటింగ్‌ మొదలుపెట్టాడు. ఈ పెయింటింగ్‌ పూర్తి కావడానికి మూడు సంవత్సరాలు పట్టింది. అంతవరకు ఆ మోడల్‌ గర్ల్‌ వస్తూ పోతూ ఉండేది. ఈ పెయింటింగ్‌ కు పూర్తి అయ్యాక ఆ చిత్రంలోని అమ్మాయి నవ్వు అతి విచిత్రంగా ఉంది. డావిన్సిని సైతం కట్టి పడేసింది. ఈ నవ్వు మాయాజాలం లా పనిచేసి కోట్లాది మందిని ఆకర్షించగలిగింది.ప్రస్తుతం ఈ పెయింటింగ్‌. ఫ్రాన్స్‌లోని లౌవ్రె మ్యూజియంలో ఉంది. మోనాలిసాతో సుప్రసిద్ధుడయ్యాక డావిన్సి మిలాన్‌ చేరుకుని 1506-1513 మధ్య కాలంలో ది వర్జిన్‌ విత్‌ చైల్డ్‌, పెయింట్‌ ఆన్నె వర్ణ చిత్రాలను లోక ప్రియంగా రూపొందించాడు. 1513లో రోమ్‌ చేరుకున్నాక ఫ్రాన్సిస్‌ మహారాజు (మొదటివాడు) ప్రత్యేక అతిధిగా శేష జీవితం గడిపాడు. ఎగిరే యంత్రాలను గురించి ఆలోచించి డావిన్సి ఎన్నో రకాల నమూనాలను తయారుచేసాడు. విమానాల వంటివి తయారుచేశాడు.మనిషి శరీరం గురించి పూర్తి వివరాలు తెలియజేశాడు. నీటి గడియారాన్ని అందించాడు. బరువైన వాటిని తేలికగా తొలగించే క్రేన్‌లను డావిన్సి ఆకాలంలోనే యేర్పాటు చేశాడు. 1519లో మరణించాడు.

Tags: Oil painting during the Renaissance of Italy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *