Okay, three years ago: Prabhas

మూడేళ్ల క్రితమే ఓకే చెప్పా: ప్రభాస్‌

ఈనాడు.

Date :02/01/2018

ఇంటర్నెట్‌ డెస్క్‌ హైదరాబాద్‌: ‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చకున్న యంగ్‌ రెబెల్‌ స్టార్‌ ప్రభాస్‌ త్వరలో బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తారని ఇది వరకు వార్తలు వెలువడ్డాయి. బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ తన సినిమాలో ప్రభాస్‌ను ఎంపికచేసుకున్నట్లు వూహాగానాలు వినిపించాయి. ప్రముఖ మ్యాగజైన్‌ జీక్యూ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్‌ భవిష్యత్తులో తాను చేయబోయే సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం..
‘బాహుబలి సినిమా నా జీవితాన్నే మార్చేసింది. ఈ సినిమా హిందీ, తమిళం, మలయాళంలో కూడా విడుదలైంది. ఈ సినిమా విడుదలయ్యాక నా పాత సినిమాల డబ్బింగ్‌లకు కూడా మంచి స్పందన లభించింది. మలయాళం, తమిళంలో కంటే హిందీ ప్రేక్షకులు ‘బాహుబలి’ సినిమాకు ఎలా స్పందిస్తారో అని నేను రాజమౌళి కాస్త కంగారుపడ్డాం. కానీ హిందీ ప్రేక్షకులకు బాగా నచ్చింది అని తెలీగానే షాకయ్యాం.’
‘ఒక నటితో అనేక సినిమాలు చేస్తున్నప్పుడు ఇద్దరి మధ్య రిలేషన్‌ ఉంది అనే వార్తలు వెలువడటం సహజమే. నాకు అనుష్కకు కూడా అదే జరిగింది. కానీ నేను అనుష్క ఇప్పటికీ ఎప్పటికీ మంచి స్నేహితులమే. ‘బాహుబలి’ సినిమా తర్వాత అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది కదా అని విజయాన్ని తలకెక్కించుకోను. చిత్ర పరిశ్రమలో నాకు ఎంత మంచి స్నేహితులు ఉన్నారంటే.. నేను పొగరుగా ప్రవర్తిస్తే నా తలపై మొటిక్కాయ వేసి నన్ను అదుపు చేసే వారున్నారు.’
‘హిందీ సినిమాల్లో నటిస్తున్నానని చాలా వార్తలు వెలువడుతున్నాయి. నేను చాలా కాలంగా హైదరాబాద్‌లోనే నివసిస్తున్నాను. ఇక్కడ 60 శాతం మంది హిందీలోనే మాట్లాడతారు. నేనూ హిందీ సినిమాలు బాగా చూస్తాను. చెప్పాలంటే మూడేళ్ల క్రితమే ఓ హిందీ సినిమాకు ఓకే చేశాను. అది ప్రేమకథా నేపథ్యంలో రాబోతోంది.‘సాహో’ తర్వాత ఆ సినిమాలో నటిస్తాను. నాకు బాలీవుడ్‌లో కరణ్‌ జోహార్‌ మంచి స్నేహితుడు. నాకు ఏం కావాలన్నా అతన్ని నిర్మొహమాటంగా అడుగుతాను. ‘బాహుబలి’ సినిమా సమయంలో మాకు చాలా సాయపడ్డారు.’‘ఓ హీరోకు ఫలానా పాత్రతో గుర్తింపు వచ్చిందంటే.. అతను నటించబోయే తర్వాతి సినిమాలోనూ అదే పాత్రలో నటించాలని కోరుకుంటారు. హాలీవుడ్‌లో ఓ హీరో బ్యాట్‌మ్యాన్‌, సూపర్‌మ్యాన్‌ పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంటే ఇక అతను వేరే పాత్రల్లో నటస్తే ఆ సినిమా ఫ్లాప్‌ అవుతుంది అనుకుంటారు. కానీ అందులో లాజిక్‌ లేదు. స్క్రిప్ట్‌ బాలేకపోతే సినిమా ఆడదు. కానీ స్క్రిప్ట్‌ బాగోక సినిమా ఆడకపోతే హీరోనే సరిగ్గా నటించలేదని అంటారు. అదే సమస్య. ‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్‌ సూపర్‌స్టార్‌ అయిపోయాడు అని అంటున్నారు. కానీ నా ఉద్దేశం ప్రకారం నేను ఏదో ఒకరోజు సూపర్‌స్టార్‌ అవ్వాలని కోరుకుంటున్నాను.’
‘ఈ మధ్యకాలంలో స్టార్‌ కిడ్స్‌కి సులువుగా అవకాశాలు దొరుకుతాయి వారికి ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు లాంటి మాటలు వింటున్నాను. మా నాన్న సక్సెస్‌ఫుల్‌ నిర్మాత. కానీ నా కాలేజ్‌ రోజుల్లో బస్సులో వెళ్లేవాడిని. అప్పుడు నన్ను చూసి ‘అతను పెద్దింటి కుటుంబం నుంచి వచ్చాడు’ అంటుండేవారు. జీవితంలో ఇలాంటి కొన్ని విషయాలనే నన్ను కష్టపడేలా చేశాయి.’ అని చెప్పుకొచ్చారు ప్రభాస్‌.
Tags : Okay, three years ago: Prabhas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *