పాత జీతాలే ఇవ్వాలి..

-రిలే దీక్షలో పాల్గోన్న ఉద్యోగ నేతలు
 
అమరావతి ముచ్చట్లు:
 
ప్రభుత్వంతో చర్చలకు రావాలంటే ముందుగా నివేదిక బయటపెట్టి, జీవోలను పక్కనపెట్టి పాత జీతాలు వేయాలని ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేస్తున్నట్లు రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వంతో చర్చలకు తాము పెట్టిన కండిషన్లకు ఏ మాత్రం సంబంధం లేదని తెలిపారు. జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద నూతన పి ఆర్ సి కి వ్యతిరేకంగా పిఆర్సి సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలో బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నివేదిక లేకుండా కొత్తజీవితాలు ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలా ఇచ్చిన జీతాలు చెల్లవు అన్నారు. చర్చలకు రావడంలేదని, చర్చలకు వచ్చి ఉంటే పాత జీతాలు వచ్చి ఉండేవేమో అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్న వ్యాఖ్యలను ఖండించారు. చర్చకు వచ్చిన ఉద్యోగుల్ని అవమాన పరచడం వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. ఎందుకు ఆ స్థాయిలో ఉండి అబద్దాలు ఆడుతున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఉద్యోగులు వెనుక ఈ శక్తులు పని చేయడం లేదని, కేవలం 13 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన పోరాటాన్ని అర్థం చేసుకొని నివేదిక పెట్టాలని , పాత జీతాలు వేయాలని డిమాండ్ చేశారు. మూడో రోజు కొనసాగుతున్న రిలే దీక్షలు దాదాపు 1000 మంది మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పిఆర్సి సాధన సమితి కన్వీనర్ ఈశ్వరరావు తదితర నేతలు పాల్గొన్నారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Old salaries should be given ..

Natyam ad