ఓమిక్రాన్ చంపదు..బాధిస్తుంది

* ఓమిక్రాన్ సోకిన వారిలో నూటికి తొంబై మందికి ఎలాంటి లక్షణాలు వుండవు
* జలుబు , గొంతులో గరగర , కొద్ది పాటి ఒంటి నలత దీని లక్షణాలు
* ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోండి . ఒకటి రెండు రోజులు విశ్రాంతి చాలు
* కేసులు పెరగడం అంటే వేవ్ అనుకోవచ్చు
 
ముంబై ముచ్చట్లు:
ఇది వరకే ఓమిక్రాన్ విస్తరించింది అనిపించినా , గణాంకాల ప్రకారం చూస్తే …
1 . ముంబై , ఢిల్లీ నగరాల్లో ఓమిక్రాన్ వేవ్ మొదలయ్యింది .
2 . తెలంగాణ లో కూడా కేసులు పెరగడం ప్రారంభం అయ్యింది .
ఎన్ని టెస్ట్ లు చేస్తారు అనే దాన్ని బట్టి కేసులు రోజుకు రెట్టింపు అవుతూ , జనవరి చివరి కల్లా లక్షల్లోకి చేరవచ్చు . ఓమిక్రాన్ ఎవరినీ వదలదు . అందరికీ సోకుతుంది .
ప్రపంచ వ్యాప్తంగా డేటా చూస్తే ..
1 . ఓమిక్రాన్ సోకిన వారిలో నూటికి తొంబై మందికి ఎలాంటి లక్షణాలు వుండవు . మిగతా పదిమందికి అతి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటాయి . ఇది సూపర్ మైల్డ్
2 . ఓమిక్రాన్ చంపదు. ఎలాంటి మందులు వాడకుండానే లక్షలాది మంది ఓమిక్రాన్ సోకిన వారు కోలుకున్నారని దక్షిణాఫ్రికా డాక్టర్ లు తెలియచేసారు . తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ లు ఓమిక్రాన్ రోగులకు కేవలం విటమిన్ మాత్రలు అంటే బి , సి , డి విటమిన్  మాత్రలు మాత్రమే ఇచ్చినట్టు చెప్పారు .
౩. జలుబు , గొంతులో గరగర , కొద్ది పాటి ఒంటి నలత దీని లక్షణాలు . కొంత మందికి ఒకటి రెండు రోజులు జ్వరం ఉండవచ్చు . రెండు మూడు రోజుల పాటు వేడి నీళ్లు తాగడం , గొంతు లో గరగర ఆంటే సోర్ త్రోట్  తగ్గించడం కోసం వేడి నీళ్లలో ఉప్పు వేసి నోట్లో పోసుకొని తల పైకెత్తి గార్గిల్ చేయడం , వేడి పాలల్లో పసుపు వేసుకొని తాగడం , లేదా అల్లం పసుపు కొద్ది పాటి సుగంధ ద్రవ్యాల తో చేసిన కషాయాన్ని రోజుకు ఒకటి లేదా రెండు  సార్లు టీ లాగా తాగడం చెయ్యాలి . సాధారణంగా లక్షణాలు  రెండు రోజుల్లో తగ్గిపోతాయి . జ్వరం ఉంటే డోలో 650 ఒకటి రెండు రోజులు వాడొచ్చు .  తగ్గని పక్షం లో డాక్టర్ ను సంప్రదించవచ్చు . ఆసుపత్రి లో చేరాల్సిన అవసరం ఉండదు . ఆక్సిజన్ అవసరం ఏర్పడదు . రుచి వాసన పోదు .
ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది జలుబు లాంటిది . ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోండి . ఒకటి రెండు రోజులు విశ్రాంతి చాలు . దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వం ఓమిక్రాన్ సోకినవారు ఇంట్లోనే ఉండాలి అనే రూల్ తీసేసింది . సోకినా బయటకు వెళ్లొచ్చు . అందరికీ టెస్ట్ లు చేయడం,  ఒక వ్యక్తికి పాజిటివ్ వస్తే అతని కుటుంబ సబ్యులకు కూడా టెస్ట్ లు చేయడం లాంటివి అవసరం లేదని ఆ ప్రభుత్వం నిర్ణయించింది . ఇక్కడ మన ప్రభుత్వాలు ఎలాంటి నియమాలను తెస్తాయో చూడాలి . భాద్యత కలిగిన పౌరులుగా ప్రభుత్వ నియమాలను పాటిద్దాము . ఇలాంటివి మార్చ్ తరువాత ఇక ఉండవు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Omicron does not kill..it affects

Natyam ad