16న ఇరాన్ అధ్యక్షుడు హైదరాబాద్‌కు రాక 

Date:15/02/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహనీ ఈనెల16న  హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆయన రేపు చార్మినార్ వద్ద ఉన్న మక్కా మసీదులో శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొంటారు. మ‌సీదులో ప్రార్థ‌న‌ల అనంత‌రం ఆయ‌న మ‌త పెద్ద‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఆయన నగరంలోని గోల్కొండ‌ కోటతో పాటు సాలార్ జంగ్ మ్యూజియంలను కూడా సందర్శిస్తారు. రోహ‌నీ రాక సంద‌ర్భంగా ఇరానియ‌న్ ఆయిల్ కంపెనీతో భార‌తీయ అధికారులు ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న ఇవాళ భార‌త్‌కు చేరుకోనున్నారు. ఈనెల 17వ తేదీన ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో రోహ‌నీకి స్వాగ‌తం తెలుపనున్నారు. కాగా హసన్ రోహనీ రాక సందర్బంగా నగర పోలీసులు చార్మినార్  ప్రాంతం లో భారి పొలిసు బందోబస్తు ఏర్పాటు చేసారు..
Tags: On 16th, the President of Iran arrives in Hyderabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *