On January 18th, Mahaneta NTR will make the announcement of Vardhana. - JPPTC SOLUTION

జనవరి 18 న మహానేత ఎన్టీఆర్ వర్ధంతిని జయప్రదం చేయండి. – జెడ్పీటీసీ సులోచన

Date: 17/01/2018

 On January 18th, Mahaneta NTR will make the announcement of Vardhana. - JPPTC SOLUTION

On January 18th, Mahaneta NTR will make the announcement of Vardhana. – JPPTC SOLUTION

పెద్దపంజాణి ముచ్చట్లు:

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 22 వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జెడ్పీటీసీ సులోచన పిలుపునిచ్చారు.జనవరి 18 న మండల కేంద్రంలోని తెదేపా కార్యాలయంలో ఉదయం 9:00 గం.లకు జరిగే వర్ధంతి కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని ఆమె కోరారు. ఈ మేరకు స్థానిక తెదేపా కార్యాలయంలో బుధవారం మండల అధ్యక్షుడు శ్రీరాములు ఆద్వర్యంలో నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జనవరి 18 న ఎన్టీఆర్ 22 వ వర్ధంతిని పురస్కరించుకుని పలమనేరు పట్టణంలోని తెదేపా కార్యాలయానికి ఉదయం 9:30 గం.లకు హాజరు కావాలన్నారు.దివంగత నేత ఎన్టీఆర్ పేరున రక్తదాన శిబిరంతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మురళీకృష్ణ, తెదేపా మండల నాయకులు మురహరిరెడ్డి, రోజాక్రిష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి భానుప్రతాప్ రెడ్డి, మాజీ సర్పంచ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags: On January 18th, Mahaneta NTR will make the announcement of Vardhana. – JPPTC SOLUTION h

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *