శివరాత్రి జాగరణ మహోత్సవం సందర్భంగా, గోల్డెన్ టెంపుల్ అలంకరణతో సిద్ధం

కామారెడ్డి ముచ్చట్లు:
శివరాత్రి జాగరణ మహోత్సవం సందర్భంగా గోల్డెన్ టెంపుల్ అలంకరణతో సిద్ధం అవుతుంది. కామారెడ్డి పట్టణంలోని వీక్లి మార్కెట్ మహా శివరాత్రి సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో నిర్వహించే శివరాత్రి జాగరణ మహోత్సవం కార్యక్రమ నిర్మాణ పనులను పట్టణ బిజెపి బృందం సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి మున్సిపల్ ప్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ, శివరాత్రి మహా జాగరణ సందర్భంగా ప్రతి సంవత్సరం జిల్లా కేంద్రంలో శ్రీరామ సేన ఆధ్వర్యంలో కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి నేతృత్వంలో నిర్వహించే శివరాత్రి జాగరణ మహోత్సవానికి పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఈ సంవత్సరం వీక్లి మార్కెట్ లో నిర్వహించనున్నామని, గోల్డెన్ టెంపుల్ నమునాలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని, కార్యక్రమంలో భాగంగా అఖండ దీపార్చన , గణపతి పూజ , ఏకాదశ రుద్రాభిషేకం , ద్వాదశ లింగార్చన , మంత్ర పుష్పం, లింగోద్భవ పూజ అంతే కాకుండా శివ నామ స్మరణతో కూడిన భజన కార్యక్రమం ఉంటుందని అన్నారు. కావున కామారెడ్డి నియోజకవర్గ హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
 
Tags:On the occasion of Shivratri Vigil, prepare with the decoration of the Golden Temple

Natyam ad