నేషనల్  హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యాలయం ప్రారంభం

పుంగనూరు ముచ్చట్లు:
 
నేషషనల్ హ్యూమన్  రైట్స్ కౌన్సిల్ ఆంద్రప్రదేశ్ మహిళా విభాగం రాష్ట్రకార్యాలయం నేడు పుంగనూరు లో  ఏ.పి.యస్.ఆర్టి సి బస్టాండ్  రోడ్డు  నందు  నూతన కార్యాలయం నేషనల్ చైర్మన్  డాక్టర్  పైడి అంకయ్య  చేతులమీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి స్థానిక తాహాశిల్దార్ వెంకటరాయుడు మున్సిపల్ కమీషనర్ రసూల్ ఖాన్,,డాక్టర్ శ్రావత్ కుమార్,సి.ఐ గంగిరెడ్డి, ముఖ్య అథితిదిలుగా హాజరైనారు.ఈ సందర్బముగా  రషీదా  బేగం మాట్లాడుతూ ఎక్కడైనా  మానవ హక్కుల ఉల్లంగణ జరిగితే తమ దృష్టికి తేవాలని ఆవిడ అన్నారు.అలాగే మున్సిపల్ కమీషనర్  మాట్లాడుతూ ఎక్కడైనా  మానవ హక్కుల ఉల్లంగణ   జరిగితే  వాటిని  క్షుణ్ణంగా  పరిశీలించి  తగుచర్యలు  తీసుకోవాలని ఎక్కువగా  పబ్లిక్  సర్వెంట్స్ హక్కులకు  భంగం కలిగిస్తుంటారని  ,ఆయన అన్నారు ,సి.ఐ గంగిరెడ్డి మాట్లాడుతూమ్ధానవ హక్కుల దృష్టి కి సమస్య  వచ్చిన వెంటనే  మాట్లాడి  అధికారుల తో  మాట్లాడి  తర్వాత తగు చర్యలు తీసుకోవాలని  ఆయన అన్నారు.నేషనల్  చైర్మన్  డాక్టర్  పైడి  అంకయ్య మాట్లాడుతూ  ఈ మద్య  ఎక్కువ గా  ప్రభుత్వ కార్యాలయాలయాలలో  మానవ హక్కుల ఉల్లంగణ జరుగుచున్నాయని  అటువంటివి మా  నేషఞల్  హ్యూమన్  రైట్స్ కమీషన్ కు  పిర్యాదు చేయవచ్చునని  ఆయన అన్నారు.ఈ కార్యక్రమం లో  పై వారితో  పాటు  నేషనల్  వైస్  చైర్మన్  ఉత్తరాది హరిప్రసాద్ ,నేషనల్  జనరల్  సెకరెట్రీ  ఎ.వినయ్ కుమార్ ,నేషనల్  మీడియా  కో ఆర్డినేటర్  మాచర్ల హరిప్రసాద్ ,ఆంద్రప్రదేశ్ ప్రెసిడెంట్  ఎ.కిషోర్ , మహిళా విభాగం  రాష్ట్రప్రధాన కార్యదర్మి చైతన్య  పాటూరి,చిత్తూరు  జిల్లా అధ్యక్షురాలు  సల్మా తదితరులు  పాల్గొన్నారు.
\
Tags: Opening of the Office of the National Human Rights Council

Natyam ad