రాజీనామా వల్ల ఒరిగేదేమిటీ…

-జగన్ పార్టీలో అంతర్మధనం
Date:22/02/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
వైఎస్ మ‌ర‌ణం సానుభూతితో అంద‌లం ఎక్కొచ్చ‌ని లెక్క‌లు క‌ట్టారు. ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన స్పంద‌న చూసి.. పాతికేళ్లు ప‌వ‌ర్ ఖాయ‌మ‌నుకున్నారు. అప్ప‌టి వ‌ర‌కూ కూడ‌బెట్టిందంతా ఎన్నిక‌ల్లో ఖ‌ర్చుచేశారు. తీరా.. చివ‌రి నిమిషంలో బొక్క‌బోర్లాప‌డిపోయారు. ఇప్పుడు.. రేపు అధికారంలోకి రాక‌పోతే ప‌రిస్థితి ఏమిట‌నే అంశంపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. అవ‌స‌ర‌మైతే అధినేత‌ను నిల‌దీసేందుకు ఏక‌మ‌వుతున్నారు.. ఔను.. ఇదంతా వైసీపీ శిబిరంలో నెల‌కొన్న గంద‌ర‌గోళం. ఏపీ విభ‌జ‌న అనంత‌రం ప్ర‌తిప‌క్ష హోదాలో ప్ర‌జ‌ల మ‌న‌సు గెల‌వ‌లేక‌పోయామ‌నే వాద‌న ఆ పార్టీ ముఖ్య‌నేతల్లో ఉన్నా నోరుమెద‌ప‌లేక‌పోతున్నారు. జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో జ‌నం రాక‌పోయినా.. నానా ఇబ్బందులు ప‌డి.. మీర జ‌నాల్ని పోగేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో కాలుపెట్టిన‌ప్ప‌టి నుంచి డ‌బ్బులు మంచినీళ్ల‌లా ఖ‌ర్చ‌వుతున్నాయంటూ ఆ నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నార‌ట‌. పోన్లే 2019లో మ‌న‌దే ప‌వ‌ర్ అనుకుంటే.. జ‌గ‌న్ అదేనండీ.. త‌మ అధినేత సృష్టిస్తున్న గంద‌ర‌గోళ ప‌రిస్థితులు.. పీట‌ముడులు.. చివ‌ర‌కు త‌మ మెడ‌కే చుట్టుకుంటున్నాయంటూ చెబుతున్నార‌ట‌. ఇప్ప‌టికే ఆర్ధికంగా.. రాజ‌కీయంగా కింద‌కు దిగ‌జారిన త‌మ‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట‌మి చ‌విచూడాల్సిన ప‌రిస్థితుల‌ను త‌ట్టుకునే శ‌క్తి లేదంటున్నారు. కేంద్రంలో ఎన్‌డీఏ అక‌స్మాత్తుగా ఎన్నిక‌లు ప్ర‌క‌టన చేస్తే చేతులు ఎత్తేయ‌టం మిన‌హా కాసులు ఖ‌ర్చు చేసే సామ‌ర్థ్యం లేద‌నేది నేత‌ల గ‌గ్గోలు. దీంతో త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ ను ప్ర‌శ్నార్ధ‌కం చేసి.. ఏడెనిమిదేళ్లుగా.. త‌మ‌ను బ‌లిప‌శువులుగా మార్చార‌నే నిర‌స‌న కూడా వ్య‌క్త‌మ‌వుతుంద‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కూ తెర‌చాటున‌.. త‌మ ఆవేద‌న వెలిబుచ్చిన నేత‌లు ఒక్కొక‌రుగా నిరస‌న స్వ‌రాన్ని బాహాటంగానే వినిపిస్తున్నార‌ట‌. రాజీనామా డ్రామా ప్ల‌స్ అవుతుంద‌నుకుంటే మైన‌స్‌గా మారింద‌నే ఆవేద‌న‌తో.. ముఖానే చెప్పేందుకు సిద్ధ‌మైన‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెవులు కొర‌క్కుంటున్నాయి.
Tags: Originated by resignation .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *