పుంగనూరులో గృహ రుణదాతలకు ఒటిఎస్‌ వరం -చైర్మన్‌ అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు:
 
దశాబ్దాల క్రితం ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేసి అవి తీర్చలేకపోయిన లబ్ధిదారులందరికి ఒటిఎస్‌ వరం లాంటిదని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. గురువారం ఆయన 16వ వార్డు సచివాలయంలో కార్యదర్శులు, వలంటీర్లతో ఒటిఎస్‌పై సమీక్ష నిర్వహించారు. ఒటిఎస్‌ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. చైర్మన్‌ మాట్లాడుతూ ఒటిఎస్‌ లబ్ధిదారుల జాబితాల ప్రకారం వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ఆయా వార్డు కౌన్సిలర్లు ఇండ్లకు వెళ్లి అవగాహన కల్పించి, ఒటిఎస్‌లో పరిష్కరించాలన్నారు. దీని కారణంగా లబ్ధిదారులకు ఆ ఇంటిని రిజిస్ట్రర్‌ చేసి ఇవ్వడంతో సంపూర్ణహక్కులు సంక్రమిస్తుందన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: OTS gift to home lenders in Punganur – Chairman Aleem Basha

Natyam ad