కాకినాడలో గడప గడపకు మన ప్రభుత్వం

కాకినాడ ముచ్చట్లు:

ప్రభుత్వ పథకాలను వివరించడంతోపాటు సమస్యలు కూడా తెలుసుకునేందుకే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి అన్నారు . గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కాకినాడ కార్పోరేషన్లోని 16 వ డివిజన్లో సిటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గడపగడపకు వెళ్ళి ప్రజలను ప్రభుత్వ సంక్షేమ పథకాల అందుతున్నాయో . , లేదో తెలుసుకుని . , వారి సమస్యలను కూడా ఎమ్మెల్యే ద్వారంపూడి స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు . కాకినాడ  16 వ డివిజన్ గోగుదానయ్యపేటలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి శుక్రవారం సాయంత్రం నిర్వహించారు . డివిజన్లో చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం కు విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి , మేయర్ సుంకర శివప్రసన్న , కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తిలకు డివిజన్ కార్పోరేటర్ పేర్ల జోగారావు ఘన స్వాగతం పలికారు . డాల్ఫిన్ స్కూల్ వద్ద ప్రారంభం అయిన ఈ కార్యక్రమంలో భాగంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి , మేయర్ , డిప్యూటీ మేయర్లు , కూడా చైర్మన్లు గడపగడపకు వెళ్ళి ప్రజలను పలకరిస్తూ., వారికి ప్రభుత్వం తరపున అందుతున్న సంక్షేమ వివరాలను తెలుసుకొవడమే కాకుండా వారికి ఇంకా ఏమైన సమస్యలు ఉన్నాయా అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అడిగి తెలుసుకుంటున్నారు . సీ.ఎం. జగన్మోహనరెడ్డిని దీవించాలని ప్రజలను కోరుతూ ..

 

 

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముందుకు సాగుతోంది . ప్రతీ గడపకు వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పధకాలు గురించి ప్రజలకు వివరించి ఎవరెవ్వరికి ఏయే పథకాలు అందుతున్నాయో అడిగి తెలుసుకుంటున్నారు . అర్హత ఉండి ., పధకం అందకపోతే అక్కడే ఉన్న సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సూచించారు . ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు . నిజం అంటే జగన్ , జగన్ అంటే నిజం అని ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేస్తున్నారని ఆయన వివరించారు . గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన 16 వ డివిజన్ లో ప్రజలు కార్పోరేషన్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం పై నమ్మకంతో అత్యధిక మెజారిటీతో పేర్ల జోగారావును కార్పోరేటర్ | గెలిపించుకోవడం జరిగిందన్నారు . నగర మేయర్ సుంకర శివప్రసన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పై ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని , | ఏదైతే సీ.ఎం. జగన్ మాట ఇస్తారో అది చేస్తారని నమ్మకం ప్రజల్లో బలంగా ఉందన్నారు . నేడు మత్యకార భరోసాను ఒక బటన్తో వారి | ఖాతాలోకి సీ.ఎం. జగన్ వేయడం జరిగిందని వివరించారు .

 

Tags: Our government to Gadapa Gadapa in Kakinada

Natyam ad