మనది మొగోళ్ల రాష్ట్రం. అందుకే రేప్‌లు అధికం-మంత్రి శాంతి ధరివాల్‌.

జైపూర్‌ ముచ్చట్లు:
మనది మొగోళ్ల రాష్ట్రం. అందుకే రేప్‌ కేసుల్లో దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నదని స్వయానా మంత్రే అసెంబ్లీలో ప్రకటించాడు. రేప్‌ కేసుల్లో దేశంలోనే రాజస్థాన్‌  మొదటి స్థానంలో ఉందని ఆ రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్‌ అసెంబ్లీలో ప్రకటించారు. మనది పురుషుల రాష్ట్రం అందుకే రేప్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయని వ్యాఖ్యానించారు. దీంతో మంత్రి వ్యాఖ్యలపై స్వపక్షంతో పాటు విపక్షంలోనూ విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.‘మనం రేప్‌ కేసుల్లో మొదటి స్థానంలో ఉన్నాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. మనం లైంగిక దాడి కేసుల్లో అగ్రస్థానంలో ఎందుకు ఉన్నామంటే.. రాజస్థాన్‌ పురుషుల రాష్ట్రం’ అని అసెంబ్లీ సాక్షిగా మంత్రి ధరివాల్‌ ప్రకటించారు.మంత్రి ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్‌ పునియా విరుచుకుపడ్డారు. మంత్రి ప్రసంగానికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
 
Tags:Ours is a Mughal state. That is why rapes are high – Minister Shanti Dhariwal

Natyam ad