Natyam ad

రాజశ్యామల తంత్రం తెలిసిన పీఠం మాది

– విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాల్లో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర
– ఉత్సవాల్లో వేదోక్తంగా రాజశ్యామల యాగం
– లోక కళ్యాణార్ధం చతుర్వేద పారాయణ
విశాఖపట్నం ముచ్చట్లు:
 
జగన్మాత రాజశ్యామల అమ్మవారి ఉపాసన పూర్తిస్థాయిలో తెలిసిన ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదాపీఠమని ఆ పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి స్పష్టం చేసారు. అమ్మవారి ఉపాసన చాలా మందికి తెలియదని, అది దశ మహావిద్యల్లో సూక్ష్మమైనది, ప్రాముఖ్యమైనది, అంతరంగమైనదని తెలిపారు. ఆ కారణంగానే సర్వ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఆరాధిస్తూ విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సోమవారం ఉదయం పీఠం వార్షిక మహోత్సవాలకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వాములు అంకురార్పణ చేసారు. ఈసందర్భంగా ఏర్పాటైన పండిత సభలో ఆయన మాట్లాడారు. రాజశ్యామల అమ్మవారి మహాత్స్యాన్ని వివరించారు. అమ్మవారిని మహా మంత్రిణిగా అభివర్ణించారు. అమ్మవారు లేకపోతే మహా కామేశ్వరికి సైతం శక్తులు వచ్చేవి కావన్నారు. అందుకే! అమ్మవారి ఆరాధన విలక్షణమైనదని స్పష్టం చేసారు. 14 ఏళ్ళ పాటు హిమాలయాల్లో సంచరించిన సమయంలో తపోస్సంపన్నుల సాన్నిధ్యం, మరో మహానుభావుని ఉపదేశంతో రాజశ్యామల అమ్మవారి తంత్రాన్ని తెలుసుకోగలిగానని చెప్పారు. ఆ తర్వాత రాజశ్యామల ఉపాసన బలంతో హిమాలయాల నుండి వచ్చి పీఠాన్ని ఏర్పాటు చేసానని తెలిపారు. పీవీ నరసింహారావు మొదలు ముఖ్యమంత్రుల వరకు అనేక మంది విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా రాజశ్యామల అమ్మవారి కృప పొందారని వివరించారు. ప్రస్తుతం తమ పీఠం సిద్ధి పీఠంగా, అభిలాషను తీర్చే పీఠంగా పేరొందిందన్నారు. జగద్గురు శంకరాచార్యుల అద్వైత సిద్ధాంతాన్ని అనుసరిస్తూ అనేక గ్రంధాలు ముద్రించినా ఉపాసన విషయంలో చాలా గొప్ప స్థాయికి తమ పీఠం చేరిందని తెలిపారు.
 
పీఠానికి కుల మత భేదాలు లేవు; స్వరూపానందేంద్ర
విశాఖ శ్రీ శారదాపీఠానికి కుల మత భేదాలు లేవని స్వరూపానందేంద్ర స్వామి స్పష్టం చేసారు. కుల మత భేద రహిత అద్వైత వేదాంతాన్ని బోధించిన జగద్గురు ఆదిశంకరాచార్య బోధనలను తమ పీఠం పుణికిపుచ్చుకుందన్నారు. పీఠాధిపతులకు ఎటువంటి కాంక్షలు ఉండవని, దేశ రక్షణ, సమాజ హితం కోసమే తపిస్తామని తెలిపారు. వార్షికోత్సవాల్లో ప్రతి ఏటా శ్రౌత శాస్త్ర సభలు నిర్వహించే ఆనవాయితీ ఉన్నా కరోనా కారణంగా బ్రాహ్మణోత్తములు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ సారి వాటిని చేపట్టలేదన్నారు. అలాగే వార్షికోత్సవాలకు ఎంతోమంది ప్రముఖులు వస్తామన్నా అగ్నిహోత్ర కర్మలు నిర్వహించే బ్రాహ్మణుల ఇబ్బంది కూడదనే అనుమతించలేదన్నారు. పీఠంతో అనుబంధంగా ఉంటున్నందున ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాకను స్వాగతించినట్లు చెప్పారు. ఈ ఏడాది జూన్‌ నెలలో విశాఖ శ్రీ శారదాపీఠం భారీ ఎత్తున వైదిక కార్యక్రమాన్ని చేపట్టే ఆలోచనలో ఉందని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ప్రకటించారు.
 
Tags: Ours is a pedestal known for Rajasyamala Tantra