P. GO: Attacks on hives .. 700 cases

ప.గో : కోడిపందాలపై దాడులు.. 700మందిపై కేసులు

Date: 13/01/2018

పశ్చిమగోదావరి ముచ్చట్లు:

కోడిపందాలపై ఖాకీలు కొరడా ఝులిపిస్తున్నారు. ఏలూరు డివిజన్ లో 700మందిపై కేసులు నమోదయ్యాయి. జిల్లాలోనిఏలూరు సబ్ డివిజన్ పరిధిలో కోడి పందాల బరులపై డీఎస్పీ ఈశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. దెందులూరు, ఏలూరు రూరల్ మండలాలలో పలుచోట్ల కోడిపందాల బరులు ధ్వంసం చేశారు. కోడిపందాలను అడ్డుకునేందుకు ఏలూరు సబ్ డివిజన్‌కు ఏపీఎస్పీకి చెందిన ఓ బెటాలియన్‌ కేటాయించారు. ఏలూరు డివిజన్‌లో 500 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కోడిపందాలను అరికట్టడానికి ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో 67 పికెట్స్, 10 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కోడిపందాల బరుల వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags: P. GO: Attacks on hives .. 700 cases

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *