ఏడు పాయల జాతరను ప్రారంభించిన పద్మా దేవేందర్ రెడ్డి

Date:13/02/2018
మెదక్ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఏడుపాయల దిన దినాబివృద్ధి చెందు తుందని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు ఆమె తెలంగాణలో  ప్రసిద్ది గాంచిన ఏడుపయల జాతర ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మెదక్ జిల్లా పాపన్నపెట్ మండలం ఏడుపాయల వనదుర్గమాత కు ప్రభుత్వ పరంగా లాంఛనంగా పట్టు వస్త్రాలను పద్మ దేవేందర్ రెడ్డి దంపతులు సమర్పించారు.ఈ సంవత్సరం అమ్మ వారి ఆలయ సన్నిధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివ లింగానికి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి,ఎమ్మెల్యే  మదన్ రెడ్డి లు ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం   అతిథులను  పాలకమండలి సభ్యులు  సన్మానించారు. ఈ సందర్బంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆనవాయితీగా జరిగే జాతరకు లక్షలాధీ మంది హాజరు కావటం విశేషం.  మహాశివరాత్రి పర్వదినాన శివాలయాలలో  పూజలు జరిగితే ఏడు పాయళ్లొ అమ్మవారు పూజలందుకోవడం అమ్మవారి మహత్య మే  నన్నారు.
Tags: Padma Devender Reddy, who started seven crores

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *