రోడ్డు ప్రమాదంలో అన్నా తమ్ముడు మృతి

Date:15/02/2015

సిద్దిపేట ముచ్చట్లు:

రోడ్డు ప్రమాదంలో అన్నా తమ్ముడు మృతిచెందిన విషాద సంఘటన గురువారం సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. కడారి రాంబాబు(40), కడారి చందు(32) అనే ఇద్దరు అన్నాతమ్మడు. అయితే… వీరిని గురువారం ఉదయం గుర్తు తెలియని వాహపం ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. కాగా… అన్నాతమ్ముడు మృతిచెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే వాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

Tags: Anna’s brother killed in road accident

 వీడిన నరబలి కేసు చిక్కుముడి

Date:15/02/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మూడు నెలల చిన్నారి నరబలి కేసు చిక్కు వీడిపోయింది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీసులు ఓ కొలిక్కి తెచ్చినట్లు తెలుస్తోంది. నిందితులుగా అనుమానిస్తున్న వారికి సంబంధించిన సరైన ఆధారాలు దొరకకపోవడంతో.. డీఎన్ఏ నివేదిక కీలకంగా మారింది. రాజశేఖర్ ఇంట్లో రక్త నమూనా, ఇంటిపై దొరికిన రక్త నమూనా ఒక్కటేనని ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది. డిఎన్ఎ రిపోర్టు ఆధారంగా రాజశేఖరే నిందితుడని పోలీసులు తేల్చివేపారు.  రాజశేఖర్ అనే వ్యక్తి ఇంట్లో నరబలి జరిగినట్లు పోలీసుల నిర్ధారణకు వచ్చారు. రాజశేఖర్ భార్య అనారోగ్యం కారణంగా నరబలి ఇచ్చినట్లు వెల్లడైంది. రాజశేఖర్, అతడి భార్య శ్రీలత, మరొక ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.  రాజశేఖర్  ఓ తాండా లో 40 వేలు కి చిన్నారిని కొనుగోలు చేసినట్లు పోలీసులు విచారణ లో కుటుంబ సభ్యులు  వెల్లడించారు. చివరకు రాజశేఖర్ తానే నరబలి చేసానంటూ అంగీకరించాడు. తన భార్య శ్రీలత అమావాస్య రోజు కింద పడిపోయింది. ఆమె ఆరోగ్యం కోసం పూజారి చెప్పినట్టు గా క్షుద్ర పూజలు చేస్తే దోషం పోతూందని  రాజశేఖర్ కి ఒక మాంత్రికుడు సలహా ఇచ్చాడు. దాంతో రాజశేఖర్ 40  వేలు ఇచ్చి నుంచి తండా నుంచి కొనుకొచ్చి  ఇంట్లో నే నర బలి ఇచ్చాడు. ఈ సందర్బంగా పూజలు చేసి రసాయనాలతో ఇంటిని ను రాత్రంతా శుభ్రం చేసారు. ఈ కేసులో పది  మంది నిందితులను గుర్తించారు.  ఇప్పటికే రాజశేఖర్ , భార్య  శ్రీలత తో పాటు ఆరుగురిని  అరెస్ట్ చేసారు . అయితే పాప మొండం ని పడేసిన ప్రాంతాన్ని మాత్రం ఇంకా పోలీసులు కనుక్కోలేకపోయారు. అయితే, చిన్నారి మొండాన్ని ప్రతాప సింగారం దగ్గర మూసీ నదిలో పడేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.  చంద్రగహణం రోజున రాజశేఖర్ దంపతులు నగ్నంగా పూజలు చేసినట్లు కుడా పోలీసులు నిర్ధారించారు. చంద్రుని నీడ శిశువు తలపై పడేలా ఉంచారు.
Tags: In the case of the murdered criminal case

ఇంటర్ లో గ్రేడింగ్ ఉన్నట్టా… లేనట్టే…

Date:15/02/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
పరీక్షల ముందు ఒక మాట, పరీక్షలు ముగిసిన తర్వాత మరో మాట అన్నచందంగా వ్యవహరిస్తున్న ఇంటర్మీడియట్ బోర్డు తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రయోగ పరీక్షల్లో జంబ్లింగ్ పద్ధతి పాటిస్తామని చెబుతూ వస్తున్న ఇంటర్ బోర్డు తీరా ప్రయోగ పరీక్షలు ప్రారంభం అయ్యేసరికి మాట మార్చింది. వార్షిక పరీక్షల దగ్గర పడుతున్నా నేటికీ గ్రేడింగ్ విధానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరో పక్క తెలుగు అమలుకు సిద్ధం కావడంపై విద్యార్థుల నుండి ఉపాధ్యాయుల నుండి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ప్రాంతీయ భాష పదో తరగతి వరకే అమలులో ఉందని, తెలంగాణలో మాత్రం ఇంటర్ వరకూ ఎలా అమలుచేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. తెలుగు అమలు విధానంలోనూ, జంబ్లింగ్ విషయంలో బోర్డు అనుసరిస్తున్న పద్ధతి దారుణమని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మధుసూధనరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రాలో నిర్బంధ తెలుగు కేవలం పదో తరగతి వరకే అమలు చేస్తున్నారని, ఇంటర్‌లో దానిని అమలు చేయడం ఏ విధంగానూ సాధ్యం కాదని ఆయన చెప్పారు. ఎవరో ఏదో నిర్ణయిస్తే దానిని నిర్బంధంగా విద్యార్థులపై రుద్దాలని చూడటం సరికాదని అన్నారు. కేరళ, పంజాబ్, కర్నాటక , బెంగాల్ రాష్ట్రాల్లో స్థానిక భాషలు పదో తరగతి వరకూ అమలులో ఉన్నాయని, సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ సిలబస్‌లలో కూడా స్థానిక భాష పదో తరగతి వరకూ అమలు చేసే వీలుందే తప్ప ఇంటర్‌లో అమలు కావడం లేదని ఆయన వివరించారు. పదో తరగతి వరకూ తెలుగు చూడని వారికి ఇంటర్‌లో అక్షరాలు నేర్పిస్తామని చెప్పడం ఎంత వరకూ సాధ్యమో ప్రభుత్వమే చెప్పాలని ఆయన పేర్కొన్నారు. తెలుగు భాష అమలుపై ప్రేమ ఉండాలే తప్ప, అమలుకు సాధ్యం కాని రీతిలో దానిని నిర్బంధం చేయడం సరికాదని అన్నారు. తెలుగు అమలు చేయడం అంటే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సంవిధానానికి మేలు చేయాలని, తెలుగును స్కోరింగ్ సబ్జెక్టుగా మార్చమని పదే పదే ప్రభుత్వం చెప్పడం కూడా విద్యార్థులను మోసగించడమేనని ఆయన పేర్కొన్నారు. అలాగే గ్రేడింగ్ విధానం కూడా ఇదిగో అదిగో అంటూ ఏళ్లు గడిపేసిందని అన్నారు.
Tags; Grading in Inter …

గులాబీ పార్టీకి వ్యతిరేకంగా కూటమి

Date:15/02/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
సార్వత్రిక ఎన్నికల వేడి పెరుగుతోంది. పొత్తులు, ఫ్రంట్‌లు, కలయికలు, కొత్త పార్టీలు, ఫిరాయింపులు ఊపందుకుంటున్నాయి. తాజాగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ప్రజా గాయకుడు గద్దర్, ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలిసి ఓ పార్టీ స్థాపించాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ గాబరా పడింది. ఎందుకంటే కృష్ణయ్యతో బిసిల ఓట్లు, మంద కృష్ణతో దళితుల ఓట్లు దూరం అవుతాయన్న భయం. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా నేరుగా ఆర్. కృష్ణయ్య నివాసానికి చేరుకుని మంతనాలు జరిపారు. కొత్త పార్టీ పెడితే ఓట్లు చీలిపోయి, మళ్లీ టిఆర్‌ఎస్‌కే మేలు చేకూరుతుంది కాబట్టి అటువంటి ఆలోచన ఏదీ చేయరాదని కోరారు. అంతేకాదు తమ పార్టీలోకి వచ్చినట్లయితే గౌరవప్రదమైన స్థానాన్నీ కల్పిస్తామన్నారు. ఇదే విషయాన్ని మంద కృష్ణకూ చెప్పాల్సిందిగా కుంతియా కృష్ణయ్యను కోరినట్లు సమాచారం. తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని, గద్దర్, మంద కృష్ణతో మాట్లాడిన తర్వాతే తుది అభిప్రాయాన్ని వెల్లడించగలనని కృష్ణయ్య ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇలాఉండగా కుంతియా దౌత్యంపై కృష్ణయ్య, మంద కృష్ణ, గద్దర్‌లు చర్చించారు. ఇది కాంగ్రెస్ స్వలాభం కోసమే చేస్తున్న ఎత్తుగడగా వారు భావించారు. పార్టీ స్థాపించాలని, అవసరమైతే పొత్తు పెట్టుకోవాలే తప్ప తొందరపడి కాంగ్రెస్ 3తీపి2 మాటల్లో పడరాదని నిర్ణయించినట్లు తెలిసింది. కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి, ముందుకు సాగాలని గద్దర్, మంద కృష్ణ మాదిగ భావిస్తున్నట్లు సమాచారం.బిసిల సమస్యలపై సంవత్సరాల తరబడి పోరాటాలు చేస్తూ బిసి నేతగా గుర్తింపు పొందిన కృష్ణయ్య పార్టీ పెడితే ఎలా?, దళితులను ఆకర్షించి దళిత నేతగా గుర్తింపు పొందిన మంద కృష్ణ, ప్రజా గాయకుడు గద్దర్ కృష్ణయ్యతో కలిస్తే ఎలా? అని కాంగ్రెస్‌లో తర్జన-్భర్జన జరుగుతున్నది. మరోవైపు టి.జెఎసి చైర్మన్ ఫ్రొపెసర్ ఎం. కోదండరామ్, సిపిఐతో కలిసి సకల జనుల ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే జరిగితే తామే చొరవ తీసుకుని సకల జనుల మహా ఫ్రంట్‌కు శ్రీకారం చుట్టి కృష్ణయ్య, కోదండరామ్, గద్దర్, మంద కృష్ణతో పాటు సిపిఐని, ఆ పార్టీతో కలిసి వచ్చే పార్టీలనూ కలుపుకుని పోతే బాగుంటుందని కాంగ్రెస్ నేతల ఆకాంక్ష.కాగా సిపిఎం మరో అడుగు ముందుకేసి దళిత సంఘాలను కలుపుకుని బహుజనుల ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నది. జస్టిస్ చంద్ర కుమార్ నేతృత్వంలోనూ ఓ పార్టీ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. డాక్టర్ చెరుకు సుధాకర్ ఇదివరకే తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించి టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఇన్ని పార్టీలు, ఫ్రంట్‌లూ పుట్టుకుని వస్తే కేసీఆర్‌కే లాభం అనే అంఛనా, అనుమానాన్ని మరి కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.
Tags: The alliance against the pink party

అకాల వర్షం  అపార నష్టం

Date:15/02/2018
నిజామాబాద్ ముచ్చట్లు:
ఒడిదుడుకులను అధిగమిస్తూ, ప్రతీకూల పరిస్థితులకు ఎదురొడ్డి పంటలు సాగు చేస్తున్న జిల్లా రైతాంగానికి ప్రకృతి సహకరించక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం అన్నదాత వెన్ను విరిచింది. సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో అకాల వర్షాలు కురియడం ఆనవాయితీగా వస్తుండగా, ఈసారి అసలేమాత్రం ఊహించని రీతిలో ఆదివారం రాత్రి 10గంటల నుండి అర్ధరాత్రి వరకు ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం అనేక మండలాల్లో బీభత్సమే సృష్టించింది. వర్షానికి తోడు వడగండ్లు కురియడంతో పంటలకు అపార నష్టం వాటిల్లింది. వడగళ్ల వాన ధాటికి వేలాది ఎకరాల విస్తీర్ణంలో సాగైన ఎర్రజొన్నతో పాటు, పెద్ద ఎత్తున పసుపు నిల్వలు తడిసి ముద్దయ్యాయి. వీటితో పాటు అక్కడక్కడా మొక్కజొన్న, పత్తి, శెనగ, మిర్చి, పప్పు దినుసులు, ఆకు కూరల పంటలకు సైతం నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. చేతికందిన ఎర్రజొన్న, పసుపు నిల్వలను ఎక్కడికక్కడ ఆరబెట్టగా, ఈ పంటలు పూర్తిగా వర్షార్పణం అయ్యాయి. అసలే దిగుబడులు అంతంతమాత్రంగానే చేతికంది, ప్రస్తుతం వ్యాపారుల మార్కెట్ మాయాజాలం వల్ల మద్దతు ధరలు గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో వరుణుడు అకాల వర్షం రూపంలో రైతన్నను మరింతగా కుంగదీశాడు. ఒక్క వరి పంట మినహా, ఇతర పంటలన్నింటిని అకాల వర్షం దెబ్బతీసింది. నవీపేట, నందిపేట, మాక్లూర్, ఎడపల్లి, మెండోరా, ముప్కాల్ మండలాల్లో వడగళ్ల వానలు కురిసి ఎర్రజొన్న తదితర పంటలు పూర్తిగా నేలవాలాయి. బాల్కొండ, మెండోరా మండలాల్లో ఆరుబయట ఉన్న సుమారు 170వరకు గొర్రెలు వడగళ్ల ధాటికి తాళలేక మృతి చెందాయి. భారీ ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో  అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అత్యధికంగా నవీపేట మండలంలో 33.2మి.మీ వర్షపాతం నమోదైంది. బాల్కొండలో 18.4మి.మీ, నందిపేటలో 18, కోటగిరిలో 14.4, బోధన్‌లో 10.6, ఎడపల్లిలో 8.6, మాక్లూర్‌లో 5.0మి.మీ వర్షం కురిసింది. వర్షపాతం తక్కువగానే నమోదైనప్పటికీ, పై మండలాల్లో దాదాపుగా అరగంటకు పైగా ఏకధాటిగా వడగండ్లు కురియడం భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చినట్లయ్యింది. చేతికందిన ఎర్రజొన్న, మొక్కజొన్న పంట వడగళ్ల ధాటికి పూర్తిగా నేలవాలింది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు మంగళవారం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పంట నష్టం వివరాలను అంచనా వేయడంలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో సుమారు 10వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే తాజాగా కురిసిన వర్షం వల్ల వరి పైరుకు నీటి తడి అందడంతో పాటు, చీడపీడల బెడద దూరమవుతుందని ఈ పంటను సాగు చేస్తున్న రైతులు పేర్కొంటున్నారు. ఈ ఒక్క ప్రయోజనాన్ని మినహాయిస్తే, అధిక విస్తీర్ణంలో వేసిన ఆరుతడి పంటలకు నష్టం వాటిల్లింది. ఏమాత్రం ఊహించని రీతిలో కురిసిన అకాల వర్షం తమ ఆశలను ఆవిరిచేసిందని బాధిత రైతులు కంటతడి పెడుతున్నారు. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు తడిసి ముద్దవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈసారైనా పరిస్థితి అనుకూలిస్తుందని ఆశించగా, పంట చేతికందిన మీదట వర్షార్పణం అయ్యిందని బాధిత రైతులు విలవిల్లాడుతున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు పెద్ద ఎత్తున పసుపు పంటను తరలించారు. శివరాత్రి వేడుకల సందర్భంగా  క్రయవిక్రయాలను నిలిపివేయడంతో రైతులు తమ పంటను యార్డులో ఆరు బయటే ఉంచి స్వగ్రామాలకు వెళ్లిన తరుణంలో అకస్మాత్తుగా కురిసిన వర్షం వల్ల పసుపు నిల్వలన్నీ తడిసిపోయాయి. తమ ఇళ్ల వద్ద ఉంచిన నిల్వలతో పాటు పంట కళ్లాల్లో ఆరబెట్టిన పసుపు కూడా అకాల వర్షంతో తడిసిపోయింది. తడిసిన పంటలకు వ్యాపారులు ధరను మరింతగా తగ్గించే ప్రమాదం ఉన్నందున, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags: Lack of premature rain

టెక్నాలజీతో గ్రేటర్ పాలన

Date:15/02/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
టెక్నాలజీ వినియోగించుకుని మహానగరవాసులకు మెరుగైన పౌరసేవలను అందించటంలో దేశంలోని అన్ని స్థానిక సంస్థలకన్నా జీహెచ్‌ఎంసీ అగ్రస్థానంలో వుంది. ఇప్పటికే ఎక్కడా లేనివిధంగా ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ అనుమతులు, బర్త్, డెత్ సర్ట్ఫికెట్లను జారీచేయటంతో పాటు ప్రజల ఫిర్యాదులను సైతం ఆన్‌లైన్‌లో పరిష్కరిస్తున్న జీహెచ్‌ఎంసీ వాట్సప్‌ను ఎంతో చక్కగా సద్వినియోగం చేసుకుని అరచేతిలో పరిపాలనను కొనసాగిస్తోంది. దీంతో ఎప్పటికపుడు అభివృద్ధి పనులను పర్యవేక్షించటంతో పాటు పౌరసేవలను మరింత మెరుగ్గా ప్రజలకు అందిస్తోంది. దాదాపు 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 30 సర్కిళ్లు, ఐదు జోన్లు, 20లక్షల గృహాలున్న నగరంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవటం మామూలు విషయం కాదు. కానీ జీహెచ్‌ఎంసీకి ఉన్న సిబ్బంది, ఉద్యోగులను, అలాగే జీహెచ్‌ఎంసీతో సంబంధమున్న ఎంఏయుడీ వంటి ముఖ్యమైన శాఖలను, మున్సిపల్ శాఖ మంత్రి వంటి ముఖ్యమైన, కీలకమైన శాఖలను కలుపుతూ జీహెచ్‌ఎంసీ అధికారులు అంతర్గతంగా వందకు పైగా, ఇతర శాఖలతో సమన్వయం కోసం మరో 69 వాట్సప్ గ్రూప్‌లను క్రియేట్ చేసి ఎప్పటికపుడు ఉత్తర, ప్రత్యుత్తరాలను జరుపుతున్నారు. ఇందులో భాగంగానే జీహెచ్‌ఎంసీలో విధులు నిర్వర్తించే ఏ అధికారిని గమనించినా, గంటలో కనీసం అరగంట కన్నా ఎక్కువ సమయం సెల్‌ఫోన్ వైపు చూస్తునే గడుపుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు, సూచనలు, సలహాలతోపాటు కింది స్థాయి ఉద్యోగులకు సమాచార పరంగా కావల్సిన సహాయ సహకారాలను అందిస్తూ అధికారులు బిజీగా ఉంటున్నారు. ఈ గ్రూప్‌లలో ఆయా అంశాలవారీగా సంబంధిత కింది స్థాయి, క్షేత్ర స్తాయి అధికారుల నుంచి జీహెచ్‌ఎంసీ కమిషనర్ వరకు సమాచారం క్షణాల్లో వెళ్లిపోతోంది. వివిధ అంశాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలు, సర్కిల్, జోనల్, కేంద్ర కార్యాలయం నుంచి అందే ఆదేశాలు ఎప్పటికపుడు కింది స్థాయి సిబ్బందికి వారు ఊహించని సమయంలో సమాచారం చేరటంతో పాటు విషయం అప్‌డేట్ కూడా అవుతోంది. ఒక్కో గ్రూప్‌కు సంబంధించి ప్రధాన కార్యాలయం నుంచి సర్కిల్ స్థాయి వరకు, అలాగే క్షేత్ర స్థాయి అధికారి వరకు భాగస్వాములను చేస్తూ గ్రూప్‌లను క్రియేట్ చేశారు. అంతేగాక, వివిధ అభివృద్ది, ప్రజావగాహన కార్యక్రమాలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జీహెచ్‌ఎంసీకి నిధులను అందజేస్తున్న ఎంఎన్‌సీ, కార్పొరేట్ సంస్థలను కలుపుతూ కూడా ఓ గ్రూప్‌ను క్రియేట్ చేశారు.జీహెచ్‌ఎంసీ క్రియేట్ చేసిన వాట్సప్ గ్రూప్‌లలో అత్యంత కీలకమైంది, ముఖ్యమైంది ఎంఏయూడీ గ్రూప్. ఈ గ్రూప్‌లో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు, మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్, జలమండలి, హైదరాబాద్ మెట్రోరైలు, మున్సిపల్ పరిపాలన కమిషనర్ తదితర సంబంధిత విభాగాల అధికారులున్నారు. ఏదైనా ముఖ్య అంశాన్ని, ఆదేశాలను మంత్రి ఈ గ్రూప్‌లో పోస్టు చేయగానే కింది స్థాయి వరకు సమాచారం క్షణాల్లో చేరుతోంది. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసినపుడు మంత్రి జారీచేసే అత్యవసర నిర్ణయాలు, ఆదేశాలు చాలా వరకు అధికారులకు, ప్రజలకు మేలు చేశాయనే చెప్పాలి.
Tags: Greater rule with technology

గులాబీకి తలనొప్పిగా మారిన డబుల్ ట్రబుల్

Date:15/02/2018
అదిలాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ‌లో డ‌బుల్‌బెడ్‌రూం ప్ర‌భుత్వం మెడ‌కు చుట్టుకునేలా ఉంది. ఎన్నిక‌లు ముంచుకు వ‌స్తున్న వేళ ప్ర‌జ‌ల్లోకి వెళితే డ‌బుల్‌బెడ్‌రూంల గురించి అడిగితే ఎలా స్పందించాలో అర్ధంకాక ప్ర‌జాప్ర‌తినిధులు త‌ల‌లు బాదుకుంటున్నారు. ఇక మంత్రుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. గృహ నిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్‌రెడ్డి సొంత జిల్లా అయిన నిర్మల్లో కూడా డబుల్‌ బెడ్‌రూం పథకంలో ఆశించిన ప్రగ‌తి క‌నిపించడ‌ం లేదు. మంత్రి జిల్లాలోనే ఒక ఇంటిని కూడా నిర్మించ‌లేకపోయారు అంటూ తీవ్ర విమ‌ర్శలు వచ్చాయి. దీంతో ఈ అంశాన్ని ఇంద్రకరణ్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన స్వగ్రామమైన నిర్మల్ మండ‌లంలోని ఎల్లపెల్లిలో గ‌త ఏడాది డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. స‌ర్కారు ఇచ్చే నిధులు స‌రిపోకున్నా.. ఏవో తంటాలు ప‌డి గ్రామంలో 45 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేశారు. ప్రస్తుతం ఇవి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంది. ఎన్నిసార్లు టెండ‌ర్లు పిలిచినా కాంట్రాక్టర్లు స్పందించ‌డం లేదు. దీంతో ఈ వ్యవ‌హారం మంత్రి ప్రతిష్టకు స‌వాల్‌గా మారింది. వాస్తవానికి నిర్మల్‌ జిల్లాలో దాదాపు 3,360 డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేప‌ట్టాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,240 ఇళ్లు, అర్బన్ ప్రాంతాలైన నిర్మల్, భైంసా మునిసిపాలిటీల్లో 1,120 ఇళ్ల నిర్మాణం చేప‌ట్టాలనుకున్నారు. అయితే ఇప్పటివ‌ర‌కు గ్రామీణప్రాంతాల్లో 1,820 ఇళ్లు, ప‌ట్టణ ప్రాంతాల్లో 806 ఇళ్లు మంజూరుయ్యాయి. ద‌రఖాస్తుల స్వీక‌ర‌ణ పూర్తయింది. ల‌బ్ధిదారుల ఎంపిక జ‌ర‌గాల్సి ఉంది. ఈ క్రమంలో ఇంకా కాంట్రాక్టర్లు, టెండ‌ర్లు అని చూస్తూ కూర్చుంటే మ‌రిన్ని విమ‌ర్శలు తప్పవని మంత్రి భావిస్తున్నారు. పథకాన్ని సాకారం చేసేందుకు త‌నదైన శైలిలో చ‌క్రం తిప్పుతున్నారు. కొద్ది రోజుల కింద‌ట జిల్లాలో డ‌బుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై అధికారుల‌తో సుదీర్ఘ స‌మీక్ష జ‌రిపారు. అధికారుల అభిప్రాయాల‌ను తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధుల‌తో ఇళ్ల నిర్మాణం జ‌ర‌గ‌ని ప‌ని అనీ, ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావ‌డం లేద‌నీ కొంద‌రు అధికారులు మంత్రికి నివేదించారు. అయితే ఈ ప‌థ‌కం అమ‌లుకు ఎలాంటి చ‌ర్యలు తీసుకోవాలో చెప్పండి అంటూ అధికారులను మంత్రి అడిగారట. చివ‌రికి బ‌డా కాంట్రాక్టర్లను ఏదో విధంగా ఒప్పిస్తే కొన్ని ఇళ్లు అయినా నిర్మించ‌వ‌చ్చని సమష్టిగా ఒక అవగాహనకి వచ్చారట. ఆలోచ‌న వ‌చ్చిందే త‌డ‌వుగా జిల్లాలో భారీ కాంట్రాక్టులు చేప‌డుతున్న కాంట్రాక్టర్ల చిట్టా తీశారు. ఆయా కాంట్రాక్టు సంస్థల స్థాయికి త‌గ్గట్టుగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ బాధ్యత‌లు అప్పగించాల‌ని నిర్ణయించారు. ఇప్పటికే ఎంపికచేసిన గ్రామాల్లో కార్పొరేట్ ప్రమాణాలు కలిగిన కాంట్రాక్టర్లచే ఇళ్లనిర్మాణం చేప‌ట్టడంతో పాటు వారికి అవ‌స‌ర‌మైన స్టీలు, ఇసుక, సిమెంటు త‌దిత‌ర ముడిస‌రుకులను రాయితీపై అందించాల‌ని నిర్ణయించారట‌. ఈ ప్రకారం జిల్లాలో ప్రాణ‌హిత‌- చేవెళ్ల హైలెవ‌ల్ కెనాల్‌ను నిర్మిస్తున్న సుశీ ఇన్‌ఫ్రా కంపెనీకి నిర్మల్, సారంగాపూర్ మండ‌లాల్లో డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ బాధ్యతల‌ను అప్పగిస్తున్నార‌ట‌. మామ‌డ, నిర్మల్ ప‌ట్టణంలోని బంగాల్‌ పేట్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ బాధ్యత‌ల‌ను స‌ద‌ర్‌మాట్ ప్రాజెక్టు ప‌నులు చేప‌ట్టిన సిరి ఇన్‌ఫ్రా కంపెనీకి క‌ట్టబెట్టార‌ట‌. కుభీర్ మండ‌లంలోని ఇళ్ల నిర్మాణ బాధ్యత‌లను భ‌వాని క‌న్‌స్ట్రక్షన్ కంపెనీకి, నిర్మల్‌లోని సిద్ధాపూర్‌లో ఇళ్ల నిర్మాణ‌ బాధ్యత‌ను స్థానిక కాంట్రాక్టర్లకు అప్పగించనున్నార‌ట‌. అలాగే మిగ‌తా మండ‌లాలు, ప‌ట్టణ ప్రాంతాల్లో కూడా ఇళ్ల నిర్మాణ బాధ్యత‌ను మ‌రికొన్ని సంస్థల‌కు ఇవ్వాల‌ని యోచిస్తున్నార‌ట‌. ఇళ్ల నిర్మాణానికి ముందుకు వ‌చ్చేవారికి క‌లిగే న‌ష్టాన్ని ఇత‌ర కాంట్రాక్టుల‌ను అప్పగించ‌డం ద్వారా పూడ్చేలా ప్రణాళిక‌ను సిద్ధంచేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అదే ప‌నిగా టెండర్లు పిల‌వ‌డం.. కాంట్రాక్టర్లు ముందుకు రాక‌పోవ‌డంతో ప‌రువుపోతోంద‌నీ.. ఇకనుంచి ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు వ‌స్తేనే టెండ‌ర్లు పిల‌వాల‌నీ నిర్ణయించారట‌.
Tags: Double Trouble turned into a headache

బడ్జెట్ తో సమానంగా పెరిగిన అప్పులు

Date:15/02/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ ప్రభుత్వం 2017-18 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌ రూ.లక్షా 49 వేల కోట్లు.. ఇప్పుడు మన రాష్ట్ర అప్పులు కూడా అక్షరాలా లక్షా 48 వేల కోట్లు. దీన్నిబట్టి రాష్ట్ర బడ్జెట్‌తో సమానంగా అప్పులు కూడా పైకి.. పైపైకి ఎగబాకు తున్నాయనే విషయం విదితమవుతున్నది. ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయే నాటికి (జూన్‌ 2, 2104) ఏపీ, తెలంగాణ అప్పు కలిపి రూ.1,48,060.22 కోట్లుగా నమోదైంది. రాష్ట్ర విభజనానంతరం ఆస్తులు, అప్పుల పంపిణీలో పంపిణీలో భాగంగా తెలంగాణకు రూ.61,711.50 కోట్ల అప్పు వచ్చింది. ఆ తర్వాత వీటి కథ మరింత వేగం పుంజుకున్నది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు నాలుగేండ్ల కాలంలో, నాలుగు బడ్జెట్ల సమయంలో టీఆర్‌ఎస్‌ సర్కారు చేసిన అప్పు అక్షరాలా రూ.87,091 కోట్లు. వెరసి మన మొత్తం అప్పు రూ. లక్షా 48,802 కోట్లకు చేరింది. దీన్నిబట్టి అటుఇటుగా తెలంగాణ బడ్జెట్‌.. అప్పు సరి సమానంగా పరిగెడుతున్నాయనే విషయం విదితమవుతున్నది. వాస్తవానికి రాబడులు, ఆదాయాలు, కేంద్రం నుంచి సాధించాల్సిన నిధుల విషయంలో తన పాత్రను సమర్థవంతంగా పోషించని టీఆర్‌ఎస్‌ సర్కారు.. అప్పుల విషయంలో మాత్రం చాలా దూకుడును ప్రదర్శిస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచే ఈ పద్ధతి కొనసాగుతూ వస్తున్నది. 2014-15లో రూ.9,410 కోట్లు, 2015-16లో రూ.18,856 కోట్లు, 2016-17లో రూ.35,741 కోట్లు, 2017-18 బడ్జెట్‌లో గత డిసెంబరు నాటికి రూ.23,084 కోట్ల అప్పులను ప్రభుత్వం తెచ్చింది. వీటిలో 2015-16, 2016-17 బడ్జెట్లలో సర్కారు తాను వేసుకున్న అంచనాలకు మించి అప్పులను తేవటం గమనార్హం. ఇప్పుడు ఈ అంశంపై ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు, సామాజిక వేత్తలు కలవరపడుతున్నారు. అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నాం, వాటిని తీర్చే సత్తా మా సర్కారుకు ఉందంటూ ప్రభుత్వాధినేతలు సమర్థించుకుంటున్నప్పటికీ.. ఇవి అంతిమంగా ప్రజలకు భారంగా పరిణమిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.
నాలుగేండ్లలో టీఆర్‌ఎస్‌ సర్కారు చేసిన అప్పులు (రూ.కోట్లలో)
సంవత్సరం అంచనాలు వాస్తవాలు
2014-15 —- 17,398 9,410
2015-16 —-16,969 18,856
2016-17 —–23,467 35,741
2017-18 —–26,096 23,084 (డిసెంబర్ వరకు)
మొత్తం 83,930 87,091
Tags: Debts grown equally well with the budget