పాక్ ఎకనామిక్ కారిడార్ నీలినీడలు

Date:14/02/2018
లాహోర్  ముచ్చట్లు:
పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో చైనాకు చెందిన ఓడరేవుల నిర్వహణ సంస్థ ఎండీపై ఫిబ్రవరి 5 న గుర్తుతెలియన వ్యక్తి కాల్పులు జరపడటంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీంతో చైనా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న చైనా, పాక్ ఎకనమిక్ కారిడార్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. దౌత్య కార్యాలయాలు, నౌకాదళ స్థావరాలకు సమీపంలోనే కోస్కో షిప్పింగ్ లైన్స్ మేనేజింగ్ డైరెక్టర్ చెన్ జూ‌ హత్యకు గురయ్యాడు. ముష్కరుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడు, చికిత్స పొందుతూ హాస్పిటల్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఫిబ్రవరి 5 న సెలవు రోజు కావడంతో కరాచీలోని జమ్‌జమాన్ పార్కులో షాపింగ్ కోసం వచ్చిన చెన్ జూ, చైనా టౌన్ హోటల్‌లో భోజనం చేసి బయటకు వస్తుండగా దుండగుడు ఎలాంటి కారణం లేకుండా తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపాడు.అత్యంత సురక్షితమైన జిల్లాల్లోని ఒకటైన తీర ప్రాంత నగరం కరాచీలో కోటిన్నర జనాభా ఉంటున్నారు. దీంతో తమ భద్రతపై వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒన్ రోడ్ ఒన్ బెల్ట్ ప్రాజెక్టులో భాగంగా సుమారు 50 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తోన్న చైనా, పాక్ ఎకనమిక్ కారిడార్‌పై డ్రాగన్ పునరాలోచనలో పడింది. ప్రజల భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాలని పాక్‌ను హెచ్చరించింది. చైనా ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవశ్యకత ఉందని, పాక్ ఆర్మీ మాజీ అధికారి, పాథ్‌ఫైండర్ గ్రూప్ ఛైర్మన్ ఇక్రామ్ సెహెగల్ వ్యాఖ్యానించారు. దీని వల్ల చైనా వ్యాపారవేత్తలకు పాకిస్థాన్‌పై విశ్వాసం సన్నగిల్లి, రావడానికి భయపడతారని ఆయన తెలిపారు. సీపీఈసీ వల్ల సుమారు 20 వేల మంది చైనీయులకు పాక్‌లో అవకాశాలు దక్కుతాయని గతేడాది బ్లూబెర్గ్ సమావేశంలో చైనా ప్రభుత్వమే ప్రకటించింది.మూడేళ్ల కిందట చైనా ప్రభుత్వం చైనా, పాక్ ఎకనమిక్ కారిడార్‌‌ను ప్రకటించినప్పుడు అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రాజెక్టు కోసం పనిచేసేవారికి భద్రత కల్పించడం సైన్యానికి కష్టంతో కూడిన వ్యవహారమని కొందరు వ్యాఖ్యానించారు. దీని కోసం పాకిస్థాన్ ఆర్మీ అదనంగా 15 వేల మంది సైనికులను వినియోగిస్తోంది. వీరంతా చైనీయులు విధులు నిర్వహించే ప్రాంతాల్లో వారికి కాపలాగా ఉన్నారు. వివిధ దేశాల గుండా వెళుతోన్న ఒన్ బెల్ట్, ఒన్ రోడ్ ప్రాజెక్టుకు అనేక రాజకీయ సమస్యలు, అస్థిరత్వాన్ని ఎదుర్కొంటుందని, అందులో పాకిస్థాన్ కూడా ఒకటని రెన్మిన్ యూనివర్సిటీకి చెందిన డైరెక్టర్ వాంగ్ యూవై వ్యాఖ్యానించారు.
Tags: Pakistan’s economic corridor is blue

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *