Panchayat Raj Dee at ACB

ఏసీబీ వలలో పంచాయత్ రాజ్ డీఈఈ

Date:15/02/2018
సిద్దిపేట ముచ్చట్లు:
ఏసీబీ అధికారుల వలకి మరో అవినీతి చేప దొరికింది. చె ర్యాల మండలంలో పంచాయతీ రాజ్ శాఖలో డిప్యూటీ ఈఈగా పనిచేస్తున్న  చంద్ర ప్రకాష్ లంచం తీసుకుంటే ఏసిబి వలలో చిక్కుకున్నాడు. రూ, 85 వేలు  లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రానికి  చెందిన కాంట్రక్టర్ రహీం తనకు రావాల్సిన 74 లక్షల రూపాయలబిల్లులు ఇవ్వమని అభ్యర్ధించారు. దానికి డీఈఈ  చంద్ర ప్రకాష్ కాంట్రక్టర్ రహీం ని మొదటగా లక్షా పదివేలు లంచం ఇవ్వమన్నాడు.  కాంట్రాక్టర్ రహీం 50 వేలు మాత్రమే ఇస్తానన్నాడు.  చివరికి రూ 85 వేలకు  డీల్ కుదిరింది. ఈ నేపథ్యం లో కాంట్రాక్టర్ రహీం  ఏసీపీ  మెదక్   డియస్పీ ప్రతాప్ కుమార్ ని కలిసి ఫిర్యాదు చేసాడు. దాంతో గురువారం నాడు  ఏసిబి అధికారులు తన బృందం తో నిఘా వుంచారు. చంద్రప్రకాష్ లంచం డబ్బులు తీసుకుంటుండగా రెండ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డీఈఈని  అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
Tags: Panchayat Raj Dee at ACB

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *