Pandey's words ...

‘పైడి’ పలుకులు…

Date: 14/01/2018

* మనకు తెలిసినది చాలా స్వల్పమని తెలుసుకునేందుకు ఎంత తెలుసుకోవాలో.
* పరిస్థితులు బలహీనుణ్ణి శాసిస్తాయి. కాని అవే వివేకి విజయానికి సాధనాలవుతాయి.
* తెలివి తేటలన్నవి వివేకం అనిపించుకోవు.
* మనిషి స్వతంత్రంగా పుట్టాడు. కాని అతడు అన్నిచోట్లా బంధాలతో బంధింపబడి ఉన్నాడు.
* అలవాటు మానవ స్వభావాన్ని నియత్రించే చట్టం.
* చేసిన తప్పుడు పనులను గురించి చెప్పి పశ్చ్యాత్తాప పడటం అన్నది మంచి పనికి శ్రీకారం చుట్టే మంచి పని అవుతుంది.
* చేసిన తప్పును ఒప్పుకోవడం అన్నది మనిషి పవిత్రుణ్ణి చేసి ఉద్ధరిస్తుంది.
* నిజమైన అందం పవిత్రమైన హృదయమై ఉంటుంది.
* రెండు దుఃఖాల మధ్య విరామమే సుఖం.
* న్యాయసూత్రాలను సమానత్వాన్ని కోరే అక్కర అధిగమిస్తుంది.
* శ్రద్ధగా వినడం అలవాటు చేసుకో. బాగా మాట్లాడలేనివారి నుండి కూడా మీరు లాభం పొందుతారు.
* అన్నీ భగవంతుడిపైనే ఆధారపడ్డాయన్నట్లు ప్రార్ధించు. అన్నీ నీపైనే ఆధారపడ్డాయన్నట్లు శ్రమించు.
* వయసు, వివేకం ఈ రెండూ కలిసి సంచరించవు.
* తన దోషాలను గుర్తించకపోవటాన్ని మించిన పొరపాటు లేదు.
* జీవితానికి అత్యున్నత లక్ష్యం ఏర్పరుచుకోవడం కష్టం. ఏర్పరుచుకుంటే దాన్ని సాధించడం సులభం.

Tags: Pandey’s words ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *