తిరుమలలో పరిపూర్ణానంద స్వామి

తిరుమల ముచ్చట్లు:
 
తిరుమల శ్రీవారిని శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి,బిజెపి నేత సునీల్ డియోధర్ శుక్రవారం దర్శించుకున్నారు.  పరిపూర్ణానంద స్వామిజీ మాట్లాడుతూ ఒమిక్రాన్ నివారణకు స్వామి అనుగ్రహం ఒక్కటే నివారణ. ప్రపంచం కొట్టు మిట్టాడుతున్న సమస్య ఒక్కటే ఓమిక్రాన్. ఓమిక్రాన్ వ్యాధి వ్యాప్తి పూర్తిగా అంతమవ్వాలని,పెద్దలు పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వేడుకుంటున్నా.
బిజెపి నేత సునీల్ డియోధర్ మాట్లాడుతూ ప్రజలకు వైకుంఠ,సంక్రాంతి,భోగి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు టీటీడీ చక్కటి ఏర్పాట్లు చేసింది. ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక క్యాపిటల్ తిరుమల దేస్థానం. కరోనా మూడో వేవ్ సమర్ధ వంతంగా ఎదుర్కొనేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిన్నటి రోజుకు 3 కోట్లకుపైగా వ్యాక్సినేషన్ పూర్తి చేసింది మోడీ ప్రభుత్వం. యావత్ ప్రజానీకానికి మంచి బుద్దిని ప్రసాదించాలని స్వామిని వేడుకున్నానని అన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Paripurnananda Swami in Thirumala

Natyam ad