Part of the garage

గరుడలో భాగమే

 Date:12/10/2018
విజయవాడ  ముచ్చట్లు:
ప్రధాని నరేంద్ర మోడీ,అమిత్ షా ఇద్దరు చంద్రబాబుపై రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. ఐటీ, ఎన్ఫోర్స్ మెంట్ దాడులు ఆపరేషన్ గరుడ లో భాగమే. ఉక్కు కర్మాగారం కావాలని ఉద్యమించిన ఎంపీ సియం రమేష్ పై ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ దాడులు కక్షపూరితమైన చర్యలని ఏపీఎస్ఆర్టీపీ ఛైర్మన్ వర్ల రామయ్య అన్నారు. మేము మీలాగా నైతికత విడిచి భాజపా నాయకులపై కక్ష కడితే ఏమైపోతారో ఆలోచించండి. మూడు రోజులు క్రితం తనపై ఎందుకు దాడులు చేస్తున్నారని నోటీస్ ఇస్తే ,దాడులు చేయిస్తారా? మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని సంభోదించినందుకు గల్లా జయదేవ్ పరిశ్రమపై దాడులు చేయిస్తారాని ప్రశ్నించారు. ఒక ప్రధాని స్థాయి వ్యక్తి రాష్ట్రంలో అధికార పార్టీని ,వైకాపా ట్రాప్ లో పడ్డారు, మిమ్మల్ని ఎవరు రక్షించలేరు అని ప్రధాని అనొచ్చా? దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఏ ప్రధాని కూడా నరేంద్ర మోడీ లా అహంకారపూరితంగా వ్యవహరించలేదని అన్నారు. మీ పగ చంద్రబాబుపైనా ,తెలుగు ప్రజాలపైనా? త్వరలో తెలుగు ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని అన్నారు. తెలుగు ప్రజలు తిరగబడిన రోజున నరేంద్ర మోడీ,అమిత్ షా జోడి ని ఎవరు కాపాడలేరు. సీబీఐ, ఈడీలను జేబు సంస్థలుగా మార్చారు. ఆంధ్రప్రదేశ్ లోని భాజపాలోని పారిశ్రామికవేత్తలపై ఎందుకు ఐటీ దాడులు చేయడంలేదు? త్వరలో మిమ్మల్ని అధికారంలో నుండి కిందకు తోసే రోజు వస్తుందని అన్నారు.
Tags:Part of the garage

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *