Partial attitude towards AP: MP Jayadev

ఏపీపై పక్షపాత ధోరణి : ఎంపీ జయదేవ్

Date:20/07/2018
న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవిశ్వాసానికి మద్దతిచ్చిన పార్టీలకు మొదట ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్ చరిత్రలోనే ఇది చాలా ముఖ్యమైన రోజు అని చెప్పారు. ఎన్డీఏ నుంచి బయటికి రాగానే మాపై కక్ష గట్టారన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం విస్మరించిందని విమర్శలు గుప్పించారు. ఆంధ్రాపై కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని గల్లా చెప్పుకొచ్చారు. అవిశ్వాసం అనేది బీజేపీ-టీడీపీ మధ్య వార్ కాదని.. మెజారిటీ-మొరాలిటీ మధ్య జరుగుతున్న యుద్ధమని గల్లా వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలపై నిలబడాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తలుపులుమూసి మరీ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన ఘటనను ఆయన సభలో మరోసారి ప్రస్తావించారు. ఏపీ ప్రజల ధర్మ పోరాటాన్ని పెద్దలు గ్రహించాలన్నారు. గల్లా జయదేవ్ మాట్లాడుతుండగా టీఆర్ఎస్ ఎంపీలు మధ్యలో జోక్యం చేసుకొని ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో కాసేపు సభ రసాబాసగా మారింది. అంతకముందు ‘భరత్ అనే నేను’ మూవీ స్టోరీని గల్లా పార్లమెంట్లో ప్రస్తావించారు. ఒక వ్యక్తి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్నదే కథాంశం. కానీ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను విస్మరించారు. ఇది టీడీపీ,బీజేపీ మధ్య యుద్ధం కాదు, ఇది ఏపీ ప్రజల ధర్మపోరాటం.ఏపీ విషయంలో పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఏపీ ప్రజలను వంచనకు గురిచేస్తున్నారు. అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారు. లోక్ సభ తలుపులు మూసి ఏపీని విభజించారు. ఆస్తులు తెలంగాణకు, అప్పులు ఏపీకి ఇచ్చారు. ఏపీపై రూ.లక్షా 3వేల కోట్ల రుణభారం మోపారని అన్నారు. వినియోగాన్ని బట్టి విద్యుత్ పంపకాలు చేశారు. అప్పులు మాత్రం జనాభా ప్రకారం పంచారు. సింగరేణి కాలరీస్ లో 51 శాతం వాటాను తెలంగాణకు ఇచ్చారు. విభజన జరిగిన నాలుగేళ్ల తర్వాత కూడా కనీస సౌకర్యాలు లేకుండా ఉందని జయదేవ్ అన్నారు.
ఏపీపై పక్షపాత ధోరణి : ఎంపీ జయదేవ్http://www.telugumuchatlu.com/partial-attitude-towards-ap-mp-jayadev/
Tags:Partial attitude towards AP: MP Jayadev

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *