Participants should provide root map on classification: Emprices

వర్గీకరణపై పార్టీలు రూట్ మ్యాప్ ఇవ్వాలి : ఎమ్మార్పీఎస్

Date:13/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో   నేత మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికల వేళ ఎస్సీ  రిజర్వేషన్ వర్గీకరణకు  అన్ని పార్టీలు అనుకూలం అని చెపుతున్నాయి. సమస్యని  పరిష్కరించాల్సిన పార్లమెంట్ లో సైలెంట్ గా ఉంటున్నాయని ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ  విమర్శించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు.  ఇకనైనా అన్ని రాజకీయ పార్టీలు రూట్ మ్యాప్  ఇవ్వాలి.   తెలంగాణలో ఎన్నికల్లో పాల్గొనే పార్టీలు నవంబర్ లో జరగబోవు శీతాకాల సమావేశాల్లో లోక్ సభ ,రాజ్య సభ లో పట్టు పట్టి చర్చకు నోటిసులు ఇవ్వాలి.
కేంద్రం మీద ఒత్తిడి పెట్టాలని అయన డిమాండ్ చేసారు.   అన్ని రాజకీయ పార్టీలకు గుర్తుచేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం లో 70 శాతం మాదిగలు,  30 శాతం మాలలు  వున్నారు.   ఆంద్రప్రదేశ్ లో 60 శాతం మాలలు, ,40 శాతం  మాదిగలు ఉన్నారు.  జనాభా ప్రాతిపదికన సీట్ల పంపిణీ జరగాలి.   తెలంగాణ లో బుడగ జంగాల  జాతి సంఘాలు  చాలా వున్నాయి.  జనరల్ స్థానాల్లో  వాళ్ళని కూడా చట్ట సభల్లో కి తీసుకువెళ్ళాలి.అలాగే,  ఎంబీసీలు కూడా కూడా చట్ట సభల్లో ఉండాలి.  అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని కోరుతున్నామని అన్నారు.
అన్ని పార్టీలు ముస్లింలను  వంచిస్తున్నాయి. అన్ని జిల్లాల్లో ముస్లింలకు సీట్లు కేటాయించాలి.  రాజకీయ అంటరానితనం బ్రహ్మణ,వైశ్యులు మీద ఉంది అని వాళ్ళకి చట్ట సభల్లో స్థానం కల్పించాలని అయన అన్నారు.  తెలంగాణ రాష్ట్రం లో అన్ని వర్గాలవాళ్లకి సమన్యాయం జరగాలని అన్నారు.  ప్రజా ఆగ్రహ మహాసభ తేదీలను త్వరలో ప్రకటిస్తామని అన్నారు. ఈ రాష్ట్రంలో  ఎమమార్పీఎస్   పాత్ర క్రియాశీలకంగా ఉంటుందని అన్నారు.
Tags: Participants should provide root map on classification: Emprices

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *