విభజనపై పార్లమెంట్ లో చర్చ జరగాలి

 రాజమహేంద్రవరం ముచ్చట్లు:
 
ఏపీ విభజన తీరుపై పార్లమెంట్లో చర్చ జరగాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. ‘‘విభజన వేళ ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో రాష్ట్ర పార్టీలు గళమెత్తాలి. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై చర్చకు కోరాలి. చర్చ జరిగితే అన్యాయం దేశానికి తెలుస్తుంది. అన్యాయం చేసిన వాళ్లే అన్యాయం జరిగిందంటున్నారు. అన్యాయంపై అడగటానికి రాష్ట్ర పార్టీలకు భయమెందుకు? మౌనంగా ఉంటే ముందు తరాలు దారుణంగా నష్టపోతాయి. ఆంధ్రాకు ఏం చేసినా అడిగేవాడు లేడని అనుకుంటారు. సీఎం జగన్ సమర్థవంతమైన వ్యాపారవేత్త. రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడం లేదు’’ అని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
 
Tags; Partition should be debated in Parliament

Natyam ad