పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకలు.

-ముఖ్యఅతిధిగా పాల్గోన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
గుంటూరు ముచ్చట్లు:
పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకలలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గోన్నారు.  ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ చారిత్రత్మక పాఠశాలగా ఉన్న ఈ పాటిబండ్ల సీతారామయ్యఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకలలో పాల్గొనడం ఆనందంగా ఉంది. నేటి యువత పాటిబండ్ల సీతారామయ్య ను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలి. ఉన్నతమైన విద్యావిలువలు కలిగినపాఠశాలలో చదువుకొని విలువలు కలిగిన వ్యక్తులుగా మిగలాలి. ప్రతి వ్యక్తి సమాజం కోసం పనిచేసేటట్లు ఉపాధ్యాయులు మాత్రమే తీర్చి దిద్దగలరు. సమాజంలో రోజురోజుకు విలువలు తగ్గిపోతున్నతరుణంలో నాయకులు క్రమశిక్షణ కలిగివుo డాలని హితవుపలికారు. నాయకులు క్రమశిక్షణతో సమాజంలో ఉండాలని వేదికలను మంచిమాటలకు ఉపయోగించాలని, వేదికలమీద ఇష్టానుసారంగామాట్లాడటం సరైన పద్ధతి కాదని గుర్తు చేశారని అన్నారు.
గుంటూరు జిల్లా వ్యాప్తంగా విద్యను ప్రోత్సహించారు కాబట్టే ఇప్పటికి అనేకమంది చేత పొగడబడుతున్నారు. ప్రతి విద్యార్థి విలువలతోకూడిన పద్దతితో ముందుకువెళ్లి ఉన్నత విద్యలు అభ్యసించాలనిఅన్నారు. విద్యను కూడా వ్యాపారంగా మార్చిన సంస్థలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యలో ఉన్న పరమార్ధాన్ని గుర్తించి విద్యార్థులు ముందుకు నడవాలి. పరభాషా వ్యామోహన్ని సమాజంవిడనాడాలి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కపడుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ఇప్పటికి కూడా నాడ్రస్ మారలేదు, నా అడ్రెస్ మారింది. కానీ సంప్రదాయాన్ని మరవకుండా ఉన్నవాడే శాశ్వతంగానిలబడగలుగుతారు.
తెలుగు భాషా మాతృభాషను గౌరవించడం నేర్చుకోవాలని హితవుపలికారు. దేవుడి దగ్గరకు వెళ్ళడానికి ఎలాంటి భాషాభేదం లేదని అన్నారు.నేనుకూడా వీధిబడిలోనేచదువు కున్నాను, ప్రధానిమోడీ,సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికూడా వీధి బడిలోనే చదువుకున్నారు. మాతృభాషలోనే ప్రతి విద్యార్థి చదువుకోవాలని సూచించారు.నేటికాలంలో యువత లేజీగా తయారయ్యారు, ప్రతిరోజు యోగ,వ్యాయాయం తప్పక ఆచరించాలి.ప్రతిఒక్కరు ఆధ్యాత్మిక, ప్రకృతితో కలసి జీవించాలని అన్నారు.విద్యతోనే ప్రతిఒక్కరు విజయాలను సాధించడానికి అవకాశం ఉంది.ప్రతి ఒక్కరూ లక్ష్యంతో పనిచేసిసమాజానికి సేవచెయ్యలని హితవుపలికారు. భారత దేశం శక్తివంతమైన దేశంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అయన  సూచించారు.
 
Tags:Patibandla Sitaramaiah High School Diamond Jubilee Celebrations

Natyam ad