ఆపరేషన్ ఆకర్ష్ లో పవన్….
ఏలూరు ముచ్చట్లు:
వచ్చే ఎన్నికల్లో జగన్ వెర్సస్ పవన్ అని తేలిపోయింది.సినిమాల పరంగా తనను పూర్తిగా అడ్డుకుంటూ తన మూలాలను దెబ్బ కొట్టే విధంగా జగన్ చేస్తున్న పనులను నిరసించడంలో పవన్ ప్రయత్నిస్తున్నారు.ఇందులో భాగంగా విజయం సాధించారు కూడా! రెండు సినిమా మీటింగులను కూడా తనకు అనుగుణంగా మార్చుకుని జగన్ పై యుద్ధం చేశారు. రిపబ్లిక్ ఫంక్షన్లోనూ, వకీల్ సాబ్ ఫంక్షన్లోనూ తన వాదం ఏంటో చెప్పారు.అదేవిధంగా భీమ్లా నాయక్ విడుదలకు ముందే మత్స్యకార సభ ఒకటి నిర్వహించి ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. తనను ఎలా అడ్డుకున్నా పడినా లేచి వస్తాను అని చెబుతున్న పవన్ తన మాట తో చేతతో మరింత వేగంగా దూసుకుపోవాలని ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలో భాగంగానే ఆయన ఇతర పార్టీల నాయకులను సైతం తన గూటికి చేర్చుకుని జగన్ కు గట్టి ఝలక్ ఇవ్వాలని పరితపిస్తున్నారు.ఇదే కనుక జరిగితే కీలక నేతల చేరికలే స్పష్టం అయితే జగన్ కు ఈ సారి మంచి ఫలితాలు రావడం ఖాయం.ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకూ ఆగేలా లేడు పవన్.ఎలా అయినా ఈ సారి మంచి స్థాయిలో బల నిరూపణ చేసి ఆశించిన సీట్లు దక్కించుకుని వైసీపీకి ఝలక్ ఇవ్వాలని అనుకుంటున్నారు.శత్రువు ఎవరో తెలిసి పోయాక యుద్ధం చేయడం అన్నది సులువు. ఆ విధంగా పవన్ ఈ సారి శత్రువు స్పష్టంగా ఎవరు అన్నది తేల్చేశారు.దీంతో రానున్న ఎన్నికల్లో జగన్ కు గట్టిగా పోటీ ఇచ్చేందుకు శ్రమిస్తున్నారు పవన్. ఇందులో భాగంగా ఇతర పార్టీల నేతలను తన పార్టీలోకి ఆహ్వానించే చర్యల్లో భాగంగా టీడీపీ కి చెందిన మంగళగిరి పట్టణ మాజీ అధ్యక్షుడ్ని ఇవాళ పార్టీలో చేర్చుకున్నారు. ఇక్కడి నుంచి మొదలయ్యే చేరికలు రానున్న కాలంలో మరింత ఎక్కువ కానున్నాయి అని తెలుస్తోంది.
ఒక సీటు నుంచే పోటీ
రాజకీయాలో ఏ పార్టీ అధినేత అయిన సత్తా చాటితేనే..ఆ పార్టీ కూడా సత్తా చాటుతుంది…అసలు అధ్యక్షుడే చతికలపడితే…పార్టీ పరిస్తితి కూడా ఘోరంగా ఉంటుంది…గత ఎన్నికల్లో ఏపీలో జనసేన విషయంలో అదే జరిగిందని చెప్పొచ్చు. జనసేన అధినేత పవన్ కల్యాణ్…రెండు చోట్ల పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు..భీమవరం, గాజువాకలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు…పవన్ ఓడిపోవడం కాదు..జనసేన కూడా ఘోరంగా ఓడింది..కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది.అయితే అది గత ఎన్నికల పరిస్తితి..కానీ ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తుంది…ఇక జనసేన సత్తా చాటడం కంటే ముందు పవన్ సత్తా చాటాల్సిన అవసరం ఉంది..పవన్ ఈ సారి ఖచ్చితంగా గెలవాల్సి ఉంది..లేదంటే ఆయన రాజకీయ భవిష్యత్ డేంజర్లో ఉంటుంది…గత ఎన్నికలంటే జగన్ గాలి ఉంది…కానీ ఈ సారి అలా ఉండదు. పైగా కొన్ని స్థానాల్లో జనసేన…టీడీపీ, వైసీపీలకు ధీటుగా పుంజుకుంటుంది.
అదే సమయంలో టీడీపీతో గాని జనసేన కలిస్తే పవన్ గెలుపే కాదు…ఇంకా జనసేన కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ సారి పవన్ మాత్రం ఆచి తూచి అడుగులేయాల్సిన అవసరం ఉంది…టీడీపీతో పొత్తు పెట్టుకుంటే గెలుపు విషయంలో ఢోకా ఉండదు…ఒకవేళ పొత్తు లేకపోయిన సొంతంగా ఎలా గెలవాలనేది పవన్ చూసుకోవాలి…ముఖ్యంగా తాను గెలిచే సీటు చూసుకోవాలి. అయితే ఈ సారి పవన్ గాజువాక, భీమవరంల్లోనే పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. ఇప్పటికే తిరుపతిలో పోటీ చేస్తారని ప్రచారం వచ్చింది…ఇటీవల కాకినాడ సిటీ గాని, రూరల్ స్థానంలో గాని పోటీ చేస్తారని కథనాలు వచ్చాయి.కథనాలు అయితే వస్తున్నాయి గాని పవన్ సీటు మాత్రం ఫిక్స్ కావడం లేదు..అయితే త్వరగా సీటు ఫిక్స్ చేసుకుంటే మంచిందని చెప్పొచ్చు. జనసేన పార్టీ వర్గాల సమాచారం ప్రకారం..భీమవరం లేదా కాకినాడ రూరల్లో గాని పవన్ పోటీ చేస్తారని, ఈ సారి మాత్రం ఒక సీటులోనే పోటీ చేస్తారని తెలుస్తోంది.
Tags:Pawan in Operation Aakarsh