రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ అసలు పనికిరాడు

-పవన్ కు యాక్టింగే సరిగా రాదు
-చిరంజీవిని అడ్డం పెట్టుకుని నటుడిగా వచ్చాడు
-పవన్ కంటే రాంచరణ్ మంచి నటుడు
మీడియాతో బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి చిట్‌చాట్
Date:13/02/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు పవన్‌ కల్యాణ్‌ హావభావాలు చూస్తే నవ్వొస్తోందని బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ప‌వ‌న్ త‌న సోద‌రుడు చిరంజీవి కార‌ణంగా సినిమాల్లోకి ప్ర‌వేశించాడ‌ని, ఆయ‌న‌కు న‌ట‌న కూడా సరిగా రాద‌ని విమ‌ర్శించారు. ఇప్పుడు మీడియా మద్దతుతో రాజకీయ నాయకుడుగా వ‌ద్దామ‌ని చూస్తున్నాడ‌ని అన్నారు.మంగళవారం ఆయన  మీడియాతో మాట్లాడుతూ… ఆయనకు యాక్టింగే సరిగా రాదనుకుంటే ఇపుడు రాజకీయాలు చేయడానికి బయలుదేరాడని మండిపడ్డారు. ఆయన రాజకీయ నాయకుడిగా పనికిరాడని పేర్కొన్నారు. అన్న చిరంజీవిని అడ్డం పెట్టుకుని నటుడిగా వచ్చాడని  అన్నారు. కానీ యాక్టింగ్ ఎలా చేయాలో నేర్చుకోలేక పోయాడని, పవన్ కంటే చిరంజీవి కొడుకు రాంచరణ్ అద్భుతంగా నటిస్తాడని అన్నారు. పవన్ కంటే ఆయన అన్నకొడుకు రాంచరణ్ మంచి నటుడు అన్నారు. అలాగే కత్తి మహేష్ లాంటి వాళ్ళను మీడియానే పైకి లేపిందన్నారు. కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ నటన చూస్తే నవ్వొస్తుంటుందన్నారు.  టీడిపి లోంచి కాంగ్రెస్ లోకి చేరిన రేవంత్ రెడ్డి పై  కూడా పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి బిజేపిలోకి వచ్చినా ఇక్కడ ఇమడలేకపోయేవారని అన్నారు. బిజేపి పార్టీలో వ్యక్తిగత దూషనలు ఉండవని, చాలా క్రమశిక్షనగా ఉండాల్సి ఉంటుందని అది రేవంత్ వల్ల కాకపోయేదన్నారు. తెరాస ప్రభుత్వంపై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్‌ను విమర్శించే ముందు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును సరిచేసుకోవాలని ఆయన హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని, వాటిలో ఎన్ని ఇళ్ల నిర్మాణం చేపట్టారో స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయం పండుగ అనే దశకు వస్తుందనుకుంటే.. అదో దండగగా మారుతోన్న పరిస్థితి దాపురిస్తోందన్నారు.  రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం ఎంత తగ్గిందో ప్రభుత్వం స్పష్టం చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కంది పంట రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో గైందో,ఎంతఉత్పత్తిరాబోతుందనే దానిపైప్రభుత్వానికిఓస్పష్టతలేదని విమర్శించారు. వ్యవసాయ ఉత్పత్తులన్నీ కేంద్రమే కొనుగోలు చేయాలంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్లు పూర్తికావస్తున్నా.. పూర్తిగా రుణమాఫీ అమలు కాలేదన్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో ప్రభుత్వం నిద్ర నటిస్తోందని ఘాటుగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ఉపకార వేతనాల నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తోందని ఆరోపించారు.  మౌలిక సదుపాయాల కొరత కారణంగా ప్రభుత్వ వైద్య కళాశాల గుర్తింపు రద్దయ్యే దుస్థితి దాపురించిందన్నారు. ఉద్యోగులకు నాలుగేళ్లుగా పీఆర్సీ బకాయిలు చెల్లించలేదని తెలిపారు.2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బిజేపి బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. అందుకోసం తెలంగాణలో అమిత్ షా పర్యటనను ఫ్లాన్ చేశామని, దీనిపై రేపు జరిగే కోర్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు వివరించారు. ఇక రాష్ట్రంలో పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేసే మరో ఆలోచన కూడా ఉందన్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే హంగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అలాగే రాష్ట్రంలో పాదయాత్ర చేయాలనే ఆలోచనలో ఉన్నామని,  పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కిషన్‌రెడ్డి అన్నారు.
Tags: Pawan Kalyan is not a politician

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *