Pawan Kalyan's fan Bobby's situation is worrying

 పవన్ కల్యాణ్ అభిమాని బాబి పరిస్థితి విషమం

Date: 09/12/2017
రాజమండ్రి ముచ్చట్లు:
పోలవరం పర్యటనకు వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ను చూసేందుకు వెళుతూ రాజమండ్రిలో ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలతో పోరాడుతున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా, కొయ్యల గూడెంకు చెందిన వీరమళ్ల బాబి మోటార్ బైక్పై పోలవరానికి వెళుతుండగా ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన బాబి రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాబి పరిస్థితి విషమంగా ఉంది. బాబి వైద్య ఖర్చులకు జనసేన నాయకులు సహకరిస్తున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. బాబి ఇంకా స్పృహలోకి రాలేదు. కుటుంబసభ్యులు ఆందోళనలో ఉన్నారు.
Tag: Pawan Kalyan’s fan Bobby’s situation is worrying

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *