భారతీయ బ్యాంకులకు రెండు లక్షల పౌండ్లు చెల్లించండి

Date:16/06/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
భారతీయ బ్యాంకులకు కనీసం రెండు లక్షల పౌండ్లు చెల్లించాలంటూ విజయ్ మాల్యాను బ్రిటన్ హైకోర్టు ఆదేశించింది. 13 బ్యాంకులకు న్యాయ పోరాటం కింద అయ్యే ఖ‌ర్చుల కింద‌ ఆ సొమ్ము అందాలంటూ కోర్టు పేర్కొన్నది. బ్యాంకుల‌కు రూ.9 వేల కోట్ల‌కు పైగా బ‌కాయిప‌డిన మాల్యా రెండేళ్ల‌కు ముందు భార‌త‌దేశం నుంచి పారిపోయిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించి స్టేబ్ బ్యాంక్ ఇండియా నేతృత్వంలోని 13 బ్యాంకులు వేసిన పిటీషన్‌ను బ్రిటన్ కోర్టు స్వీకరించింది. మే 8వ జరిగిన వాదనల్లో ఆ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. జడ్జి ఆండ్రూ హెన్‌షా ఈ తీర్పును వెలువరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాల్యా ఆస్తులను ఫ్రీజ్ చేయాలంటూ భార‌త కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను ఆ తీర్పులో స‌మ‌ర్థించింది. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు జూలై 31వ తేదీన జరగనున్నాయి. భారతీయ బ్యాంకులకు మాల్యా సుమారు 9వేల కోట్లు ఎగ్గొట్టడంతో 13 బ్యాంకుల క‌న్సార్టియం న్యాయ‌పోరాటం చేస్తోంది. తనపై నమోదు అయిన క్రిమినల్ ఆరోపణలు నిరాధారమైనవని మాల్యా తరపున లాయర్ కోర్టులో వాదించారు. అయితే 9వేల కోట్ల రూపాయ‌లు, అందుక‌య్యేవ‌డ్డీని వ‌సూలు చేయ‌డంతో పాటు, క్రిమిన‌ల్ కేసు సైతం న‌మోదు చేసేందుకు బ్యాంకులు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఆ కేసులో అతన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పగింత కేసులో వ‌చ్చే నెల‌లో ఏదో క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు మాల్యా కూడా హాజరుకానున్నారు. త్వ‌ర‌లోనే ఈ తీర్పు వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని ఈ వ్య‌వ‌హారంతో సంబంధం ఉన్న వ్య‌క్తులు చెబుతున్నారు.
Tags; Pay two lakh pounds to Indian banks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *