గ్రామంలో నెమలి నాట్యం.
ఏలూరు ముచ్చట్లు:
పశ్చిమ గోదావరి జిల్లా, బుట్టాయిగూడెం మండలం అటవీ ప్రాంత వాసులని శుక్రవారం నెమలి కాసేపు అబ్బురపరిచింది. ఎక్కడి నుండి వచ్చిందో ఎలా వచ్చిందో గ్రామస్తులకు అర్థం కాలేదు. బుట్టాయిగూడెం మండలం దొరమామిడి సమీపంలో ఉన్న అలివేరు మారుమూల అటవీ ప్రాంత గ్రామంలో మయూరం (నెమలి) పురివిప్పి దాదాపు పది నిమిషాల పాటు నాట్యమాడుతూ స్థానికులకు కనువిందు చేసింది. అనంతరం పక్కనే ఉన్న అడవిలో కి వెళ్ళిపోయింది. అటవీ ప్రాంతంలో వాతావరణ మార్పుల దృష్ట్యా మధ్యాహ్నం ఎండలు ఎక్కువగా వున్న సమయంలో నీటి కోసం వచ్చి ఉంటుంది అని గ్రామస్తులు భావిస్తున్నారు.
Tags”;Peacock dance in the village