పెగడపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండి లెక్కింపు

-ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాల ఆదాయం లెక్కింపు
ధర్మపురి ముచ్చట్లు:
 
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండి లెక్కింపును ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. మహాశివరాత్రి  పర్వదినాన్ని
పురస్కరించుకొని ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించగా, 10 లక్షల 36 వేల 615 రూపాయల ఆదాయంతో పాటు పావు తులం బంగారం, పావు కిలో వెండి సమకూరినట్లు ఆలయ కమిటీ
తెలిపారు. హుండీ ద్వారా 2 లక్షల 35 వేల 910 రూపాయలు, దుకాణ సముదాయం ద్వారా 15 వేల 950 రూపాయలు, కొబ్బరి కాయలు, బెల్లం ద్వారా ఒక లక్ష 41వేల 516 రూపాయలు, లడ్డూ పులిహోర
ద్వారా 66 వేల  516 రూపాయలు, కంకణాల ద్వారా 22 వేల 116 రూపాయలు, కొబ్బరి ముక్కల ద్వారా 12 వేల 101 రూపాయలు, టిక్కెట్లు, చందాలు, కట్నాల ద్వారా 4 లక్షల 94 వేల 506రూపాయలు, సభ్యత్వాల ద్వారా 48 వేల రూపాయలు సమకూరినట్లు ఆలయ కమిటీ తెలిపారు.
 
Tags: Pegadapally Sri Rajarajeswara Swamy Temple hundi count

Natyam ad