పెండింగ్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి
జగిత్యాల ముచ్చట్లు:
జగిత్యాల జిల్లాలో పెండింగ్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల పై సంబంధిత అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.జిల్లాలో 2413 ప్రి మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు స్కూళ్ల వద్ద పెండింగ్ లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.ప్రస్తుత విద్యా సంవత్సరంలో దరఖాస్తులకు గడువు ముగుస్తుందని, దీనిని అత్యంత ప్రాధాన్యం గా తీసుకుని త్వరితగతిన పెండింగ్ స్కాలర్ షిప్ దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల ప్రి మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల ధ్రువీకరణ లో భాగంగా విద్యార్థుల ఆధార్ ధ్రువీకరణ ప్రక్రియ, ఆధాంటికేషన్ ప్రక్రియ 3 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.స్కాలర్షిప్ దరఖాస్తు కోసం గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్ల వద్ద పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు సమర్పించని విద్యార్థులకు వెంటనే సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్ల హెడ్ మాస్టర్లు వారి విద్యార్థుల్లో పెండింగ్ స్కాలర్ షిప్ దరఖాస్తులు సమర్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అందుబాటులో ఉన్న సిబ్బందిని బృందాలుగా విభజిస్తూ వెంటనే దరఖాస్తులు సమర్పించేలా చూడాలని తెలిపారు.పాఠశాలల వద్ద విద్యార్థుల సమర్పించిన స్కాలర్షిప్ దరఖాస్తు హర్డ్ కాపీలను విద్యార్థుల బయోమెట్రిక్ ఆథాంటికేషన్ పూర్తిచేసి ఎస్సీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.స్కూల్లో స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోని విద్యార్థులకు వెంటనే సమాచారం అందించి ఈ రోజు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు.సకాలంలో స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోని పక్షంలో నష్టపోవాల్సి ఉంటుందని, దీని పరిగణలోకి తీసుకొని అత్యంత ప్రాధాన్యత క్రమంలో ఈ పని పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఇంచార్జి అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, ఆర్డీఓ జగిత్యాల మాధురి, డి.ఈ.ఓ., ఎస్సి వెల్ఫేర్ అధికారి, ఎల్.డి.ఎం., తహసిల్దార్లు, ఎం.ఈ.ఓ.లు , హెచ్.డబ్ల్యూ.ఓలు., హెడ్ మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags:Pending pre-metric scholarship applications must be completed :: District Collector G.Ravi