పెండింగ్లో ఉన్న స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి.

నెల్లూరుముచ్చట్లు:
జిల్లాలో పెండింగ్లో ఉన్న స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్  కె వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.  సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమం నిర్వహించి ,జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 13,185 అర్జీలు రాగా అందులో 9590 అర్జీలను పరిష్కరించారన్నారు. మిగిలిన అర్జీలను కూడా  త్వరగా పరిష్కరించాలన్నారు.  గడువు దాటిన 22 అర్జీలను  ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. అలాగే మరల వచ్చిన అర్జీలలో 3023 అర్జీలను పరిష్కరించడం జరిగిందని, ఇవి కాక మరో 190 మరల వచ్చిన అర్జీలను కూడా జిల్లా శాఖ అధిపతులు సమీక్షించి వాస్తవమా  కాదా పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ లు హరెందిర ప్రసాద్ (రెవిన్యూ),  గణేష్ కుమార్(అభివృద్ధి),  జాహ్నవి(గృహ నిర్మాణం), రోస్ మాండ్ (ఆసరా), జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు,   కే ఆర్ఆర్ సి ఎస్ డి సి శ్రీ దాసు, డి ఆర్ డి ఎ పిడి సాంబశివారెడ్డి,  పంచాయతీరాజ్ ఎస్  సుబ్రహ్మణ్యం, ఐటీడీఏ పీవో  కనక దుర్గ భవాని, సర్వే భూరికార్డుల ఏడి హనుమాన్ ప్రసాద్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
 
Tags:Pending response requests should be addressed promptly

Natyam ad