People should be healthy

ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలి

Date:21/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు పాపులర్‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో ఆరోగ్యవంతమైన ప్రజలు, ఆరోగ్యవంతమైన దేశం అనే నినాదంతో ఆదివారం టుకె రన్‌ నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు ఫయాజ్‌ ఆధ్వర్యంలో నానబాలవీధి నుంచి టుకెరన్‌ చేపట్టారు. అలాగే పోలీసుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాపులర్‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఫయాజ్‌ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు యోగా అలవాటు చేసుకుని, చెడు అలవాట్లను మానివేయాలని సూచించారు. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్వర్‌బాషా, చాంద్‌బాషా, జబివుల్లా, యూసుఫ్‌, ఫిరోజ్‌, అల్లాభక్షు, బావాజాన్‌, మహబూబ్‌బాషా,ఆసిఫ్‌, వశీం, అతిక్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

మూడవ వార్డులో ఆశించిన అభివృద్ధి

Tags: People should be healthy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *