'Pepsi'

మార్కెట్‌ను ముంచబోతున్న ‘పెప్సీ’

Date:14/12/2017

హైదరాబాద్‌ ముచ్చట్లు:

అదో మల్టీనేషనల్‌ కంపెనీ. తియ్యగా నోటికి అందిస్తూ తేరగా సొమ్ములు ఎత్తుకుపోయే రకం. ఫ్యాక్టరీ పెట్టుకుంటానని దేశానికి వచ్చింది. మార్కెట్లో ఉన్నవారితో పోటీపడటం కన్నా పోటీ లేకుండా చేసుకోవడమే దానికి ఇష్టం. అందుకే పోటీదారులుగా ఉన్న కంపెనీలనే కొనేసింది. మోనోపలీగా తయారై మార్కెట్‌ను ముంచేస్తోంది. జనం దాహం తీర్చడానికి కూల్‌డ్రింకులు అమ్ముతున్న ఆ కంపెనీ దాహం మాత్రం ఇంకా తీరలేదు. సరికొత్త ఆలోచనతో మరో మార్కెట్‌ను ముంచేయబోతుంది. అదే పెప్సీ కంపెనీ. కోకోకోలా డ్రింక్‌ ఒకప్పుడు ఉండేది. దానిపై అప్పట్లో నిషేధం విధించారు. భారతదేశంలో గోల్డ్‌ స్పాట్‌, లిమ్కా ఆ తర్వాత థమ్సప్‌లు వచ్చాయి. అదే కోకోకోలా పేరు మార్చుకుంది. మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. దేశంలో మారిన విధానాలను మాగ్జిమమ్‌ వాడుకుంది. ఒకవైపు పెప్సీ మరోవైపు కోకోకోలా ఇద్దరూ కలిసి లోకల్‌ డ్రింక్‌లను సొంతం చేసేసుకున్నారు. అదే పేరుతో అమ్మినా తమకే ఆదాయం వచ్చేలా చేసుకున్నారు. కూల్‌డ్రింక్స్‌ అధికంగా తాగడం హానికరమని, అందులో పురుగుల మందులు వాడుతున్నారని కన్‌ఫామ్‌ అయింది. అయినా దాని రుచికి దాసోహమైన జనం వదల్లేకపోతున్నారు. వీటికి బదులుగా కొబ్బరి నీళ్లు, ఫ్రూట్‌జ్యూస్‌లు వాడాలని డాక్టర్లు కూడా చెబుతున్నారు. మారిన బిజీ లైఫ్‌లో ప్రొటీన్లు తగ్గిపోతుండటంతో ఫ్రూట్స్‌ ఫుడ్‌ కంపల్సరీ అయిపోతోంది. అయితే దానికి ఖర్చు పెట్టగలిగే డబ్బులున్నవారు తక్కువమందే. మిగిలినవారు వీటిని కొనాలంటే స్పెషల్‌గానే రోజూ తీసుకోలేని పరిస్థితి. సరిగ్గా దీన్నే పెప్సీ క్యాష్‌ చేసుకోవాలనుకుంటోంది. బ్రెజిల్‌ వంటి లాటిన్‌ దేశాల్లో ఇప్పటికే కొబ్బరినీళ్లను కూడా ప్రాసెస్‌ చేసి పెప్సీ అమ్మేసుకుంటుంది. అక్కడే జీడి తోటలను చూసిన కంపెనీ పెద్దలకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. జీడి ఫలం నుంచి జ్యూస్‌ తీసి.. కూల్‌డ్రింక్‌ చేసి అమ్మితే ఎలా ఉంటుందనేదే ఆ ఆలోచన. ఇంకేముంది గ్రౌండ్‌ వర్క్‌ మొదలెట్టింది. ఫ్రూట్‌జ్యూస్‌లకు బదులు జనానికి చీప్‌గా దీన్ని అమ్మగలిగితే ఇక ఫ్రూట్స్‌, వాటి జ్యూస్‌లు అమ్ముకునే మార్కెట్‌ అంతా దాని చేతిలోకే వస్తుంది. ఆ కాన్సెప్టే వారికి మరింత ఉత్సాహాన్నిచ్చింది. జీడి ఫలం వల్ల కేలరీస్‌ మనిషికి ఎక్కువగా అందుతాయి. ఆరోగ్యానికి కూడా మంచిదే. అదే ప్రచారంతో జీడి జ్యూస్‌ అమ్ముకోవాలని పెప్సీ రెడీ అయిపోతోంది. అంతే కాదు తమకు లాభాలు రావాలంటే జీడిఫలం తక్కువకు దొరకాలి. అందుకు కూడా గేమ్‌ప్లాన్‌ సిద్ధం చేసింది. క్లింటన్‌ ఫౌండేషన్‌ లాంటి తమ అస్మదీయ సంస్థలను రంగంలోకి దింపింది. వీరు రైతులకు పెట్టుబడి పెట్టి మరీ జీడి పంటలు వేసేలా ప్రోత్సహిస్తారు. ఆ పంటలు వేయించి ఆ రైతుల దగ్గర నుంచి చీప్‌గా కొనుగోలు చేసి తమ వ్యాపారం చేసుకోవడానికి రంగాన్ని చకచకా సిద్ధం చేసేసుకుంటున్నారు. రెడీమేడ్‌గా దొరికే ఈ డ్రింక్‌కు జనం అట్రాక్ట్‌ కావడం చాలా ఈజీ. పళ్ల రసాలు అమ్ముకునేవాళ్లు ఇక తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే. అంతేకాదు రైతులు సంప్రదాయ పంటల నుంచి ఇప్పటికే వ్యాపార పంటలకు మారి చాలాసార్లు దెబ్బ తిన్నారు. మళ్లీ ఈ కొత్త పంటకు కూడా మారి ఆ మల్టీనేషనల్‌ కంపెనీల కబంధ హస్తాల్లో పడటం ఖాయం. ఆరోగ్యాన్ని అందిస్తుందని చెప్పే ఈ జ్యూస్‌లోనూ పురుగుమందులు కలపక తప్పదు. అది నిల్వ ఉండాలి కదా మరి. అయినా సేల్స్‌ ఫుల్లుగా అయిపోతాయి. ఎందుకంటే రంగురంగుల యాడ్స్‌తో జనం మనసులను పెప్సీ దోచేసుకుంటుంది కదా… అందుకు మన హీరోలు కూడా కోపరేట్‌ చేస్తారు కదా.

మళ్లీ వణుకుపుట్టిస్తున్న ఎబోలా
ఎబోలా వైరస్‌ వణుకుపుట్టిస్తోంది. రోజు రోజుకు తన వికృతరూపాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ హడలెత్తిస్తోంది. కొద్ది రోజుల క్రితం గినియా అడవుల్లో పుట్టిన ఎబోలా, ప్రస్తుతం ఆప్రికా దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పుడు ఈ ఎబోలా ఆసియా, యూరప్‌ దేశాల్లోకి వ్యాపించేందుకు సిద్దమవుతోంది. ప్రపంచాన్ని గజగజలాడిస్తోన్న ఎబోలా వైరస్‌ ఆప్రికా లోని లైబీరియా, సియోర్రా లియోన్‌, గినియా దేశాల్లో తీవ్రతరమవుతోంది. కొన్ని వారాల్లోనే వెయ్యి మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడి చనిపోయారు. ఇప్పుడు ఆప్రికాలోని మిగిలిన దేశాల్లోనూ క్రమంగా వ్యాపిస్తోంది. ఆఫ్రికా దేశాల్లోని చాలా ప్రాంతాల్లో ఈ వైరస్‌ సోకిన రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. క్రమక్రమంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్‌ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఎబొలా వ్యాపించకుండా అన్ని దేశాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలంటూ సూచించింది. పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కన్సర్న్‌ ప్రకటించాలని నిర్ణయించింది. వైరస్‌ ఎఫెక్ట్‌ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించినట్లు డబ్ల్యూటీవో తెలిపింది. భారత్‌లోకి ఎబోలా వైరస్‌ ప్రవేశించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎబోలా వ్యాప్తించిన దేశాల్లో దాదాపు 45 వేల మంది భారతీయులు పని చేస్తున్నారు. అక్కడ పరిస్థితి విషమిస్తే వారిని తిరిగి రప్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విస్తరిస్తున్న ఈ వైరస్‌కి అడ్డుకట్ట వేసేందుకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఎన్ని రోజులకు విరుగుడు లభిస్తుందో వేచి చూడాలి. ఎబోలా వైరస్‌తో భారత ప్రభుత్వం అప్రమత్తమయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ తెలిపారు. ఇప్పటికే దాని బారిన పడి పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో చాలా మంది చనిపోయారు. అక్కడి దేశాల్లో పనిచేసే భారతీయులు ఒక్కొక్కరుగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. దీంతో ఎబోలా వైరస్‌ భారత్‌లో కూడా విజృంభించే అవకాశం ఉందని, ప్రజలంతా అలర్ట్‌గా ఉండాలని సూచించారు. కాగా, ఎబోలా వైరస్‌ వ్యాప్తిచెందడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. దీంతో అత్యవసర పరిస్థితి ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఎబోలా వైరస్‌ను అత్యంత ప్రమాదకారిగా గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీని బారిన పడి ఇప్పటికే వెయ్యి మంది చనిపోయినట్లు ప్రకటించింది. పశ్చిమాఫ్రికాలో విపరీతంగా వ్యాపించిన ఇబోలా వైరస్‌ కేవలం కొన్ని వారాల్లోనే 900కు పైగా ప్రాణాలు బలిగింది. ఇప్పటివరకు అయితే ఇది కేవలం లైబీరియా, గినియా, సియెర్రా లియోన్‌, నైజీరియా దేశాలకు మాత్రమే పరిమితమైంది. అయితే మన దేశానికి కూడా ఇది ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ఎందుకంటే, ఇబోలా వైరస్‌ వ్యాపించిన దేశాల్లో దాదాపు 45వేల మంది భారతీయులు పనిచేస్తున్నారు. అక్కడ పరిస్థితి మరీ విషమిస్తే వీరందరినీ వీలైనంత త్వరగా వెనక్కి రప్పించాలని యోచిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ పార్లమెంటులో తెలిపారు.గినియాలో 500 మంది, లైబీరియాలో 3వేల మంది, సియెర్రా లియోన్‌లో 1200మంది భారతీయులున్నారు. నైజీరియాలో అయితే ఏకంగా 40 వేల మంది భారతీయులు ఉన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా 300 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బంది లైబీరియాలో పనిచేస్తున్నారు. ఇప్పటికే 1603 మందికి ఇబోలా వైరస్‌ సోకిందని, వారిలో 887 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నేపథ్యంలో భారతీయులకు కూడా పరిస్థితి ప్రమాదకరంగానే కనిపిస్తోంది. భారతీయుల్లో ఎవరికైనా ఈ వైరస్‌ సోకి.. అది తెలియకుండా వాళ్లు స్వదేశానికి తిరిగి రావాలని భావిస్తే పరిస్థితి ఏంటని మన అధికారులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమాఫ్రికాలో చింపాంజీలు, ఇతర జంతువులతో సన్నిహితంగా ఉన్న వాళ్లలోనే ముందుగా ఈ వైరస్‌ సోకిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రధానంగా ఇది చింపాంజీలు, గబ్బిలాల నుంచి మనుషులకు, తర్వతా మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని తెలిపారు. ఈ వైరస్‌ సోకినవారి చర్మం పక్కవారికి తగిలినా.. వారికి కూడా వచ్చేస్తుందని, వాతావరణం ద్వారా కూడా వ్యాపిస్తుందని హెచ్చరిస్తున్నారు. వీళ్లకు చికిత్స చేస్తున్నవారు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. లేనిపక్షంలో వాళ్లకు కూడా సోకుతుందని చెబుతున్నారు. ఈ భయంతోనే నైజీరియా లాంటి ప్రాంతాల్లో వైద్యవర్గాలు ఇబోలా బాధితులకు చికిత్స చేయడానికి కూడా వెనకాడుతున్నారు. ఈ వ్యాధి భారతదేశానికి వ్యాపించకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ వ్యాధి తీవ్రంగా ఉన్న దేశాల నుంచి ఎవరెవరు భారతదేశానికి వస్తున్నారు, వాళ్ల తుది గమ్యం ఎక్కడ అనే విషయాలను ముందుగానే తెలుసుకుంటోంది. కానీ అమెరికా, ఇంగ్లండ్‌ లాంటి దేశాల్లో ఇబోలా బాధితులకు ఉన్న చికిత్స సదుపాయాలు మాత్రం ఇంతవరకు భారత్‌లో లేవు. అవి కూడా వస్తే తప్ప భారతీయులకు ఈ వైరస్‌ నుంచి పూర్తి రక్షణ లభించినట్లు చెప్పలేం. మొన్నా మధ్య సార్స్‌… ఆ తర్వాత హెచ్‌ 1 ఎన్‌ 1… ఇప్పుడు ఇబోలా! తాజాగా ఈ వైరస్‌ను చూసి అమెరికా సహా అగ్రరాజ్యాలన్నీ గజగజలాడుతున్నాయి. ప్రస్తుతం సియెర్రా, లియోన్‌, లైబీరియా ప్రాంతాల్లో ఈ వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ వ్యాధి నియంత్రణకు అక్కడి వైద్యులు చేతులెత్తేయడంతో వందలాది మంది సైనిక దళాలను మోహరించాల్సిన విచిత్ర పరిస్థితి వుంది. ఇప్పటికే 887 మంది ఈ వైరస్‌ బారిన పడి మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. పశ్చిమాఫ్రికా దేశాల్లో వైద్య వర్గాలు దీనిపై ఇప్పటికే చేతులేత్తేశాయి. ఈ వ్యాధిని ఆ దేశాల్లో అదుపు చేసేందుకు ప్రపంచ బ్యాంకు రూ.1218 కోట్ల సాయాన్ని ప్రకటించింది. ఈ వైరస్‌ను వీలైనంత త్వరగా నియంత్రించకపోతే అత్యంత దారుణమైన పరిణామాలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత వారం హెచ్చరించింది. గడిచిన రెండు వారాల్లోనే ఈ వైరస్‌ బారిన పడి 61 మంది మరణించారు. గత ఫిబ్రవరిలో గినియాలోని అడవుల్లో ఈ వైరస్‌ వ్యాప్తి ముందుగా మొదలైంది. అప్పటినుంచి అక్కడ మరనాల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఆ తర్వాత పొరుగున వున్న లైబీరియా, సియెర్రా, లియోన్‌లకు ఈ వైరస్‌ పాకింది. నైజీరియాలో పాట్రిక్‌ సాయోర్‌ అనే అమెరికా పౌరుడు లైబీరియా నుంచి వచ్చిన తర్వాత జులై నెలాఖరులో మరణించాడు. అతడికి చికిత్స చేసిన వైద్యుడికి కూడా ఈ వైరస్‌ సోకింది. దీంతో అసలు ఈ వైరస్‌ సోకిన బాధితులకు వైద్యం చేయడానికి ఆరోగ్య బృందాలు భయపడిపోయాయి. పలుదేశాల్లో ఈ వైరస్‌ కు భయపడి అసలు పాఠశాలలు తెరవటం మానేశారు. సాధారణ వైద్యులు వైద్యం చేసేది లేదని చెప్పడంతో భారీ సంఖ్యలో మిలటరీ వైద్యులను, వైద్య బృందాలను సియోర్రా, లియోన్‌ తదితర ప్రాంతాలకు పంపారు. అక్కడే ఈ కేసుల సంఖ్య బాగా ఎక్కువగా వుంది. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పాకడానికి ముందే దీన్ని అరికట్టాలని ప్రయత్నిస్తున్నారు. కొన్ని ప్రాంతాలను ‘క్వారంటైన్‌’ చేసినట్టు ప్రకటించి, అక్కడి ఎవరినీ ఇతర ప్రాంతాలకు అనుమతించకుండా పకడ్బందీగా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. లైబీరియా లాంటి దేశాల్లో దాదాపు అత్యవసర పరిస్థితి ప్రకటించినట్లయింది. ఇబోలా వైరస్‌ డిసీజ్‌ (ఈవిడి)గా పేర్కొనే ఈ వ్యాధిని ఇబోలా హామోరోజిక్‌ ఫీవర్‌గా వైద్య పరిభాషలో పిలుస్తారు. మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని వర్షాలు కురిసే అడవుల్లో ఈ కేసులు ఎక్కువగా కనపడుతున్నాయి. అక్కడి అడవుల్లోని క్రూర మృగాల నుండి ఇబోలా వైరస్‌ మానవ శరీరంలోకి ప్రవేశిస్తోంది. ఇబోలా వైరస్‌ సోకిన వ్యక్తికిగానీ, జంతువుకుగానీ ఎలాంటి చికిత్సా లేదు. 1976లో నైజీరియా, సూడాన్‌, యాంబూక్‌, కాంగో దేశాల్లో ఇబోలా కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత ఇబోలా అనే నదికి దగ్గరగా వున్న గ్రామంలో ఎక్కువగా ఈ కేసులు నమోదయ్యాయి. ఇబోలా వైరస్‌ సోకిన తొలి దశలో జ్వరం, గొంతునొప్పి, కండరాల నొప్పి, తలనొప్పి వుంటుంది. రెండో దశలో వాంతులు, వికారం, అతిసారం మొదలవుతాయి. తుది దశలో శరీరంలో అంతర్గతంగా, బహిరంగంగా రక్తస్రావం జరుగుతుంది. కంటి నుండి, నోటి నుండి, ముక్కు నుండి ద్రవాలు, రక్తం కారుతాయి. మానవుడి గుండె, కిడ్నీ, కాలేయం దెబ్బతింటాయి. ఏ స్థాయిలోనైనా ఈ వైరస్‌కు చికిత్స లేదు. కేవలం మరో వ్యక్తి దీని బారిన పడకుండా చూడాలి. మామూలు వైద్య పరీక్షల ద్వారా ఇది సోకినట్టు గుర్తించలేం. హాస్పిటల్‌ ల్యాబ్‌లో పలు పరీక్షలు జరపాల్సిందే. ఇప్పటివరకు ఇబోలా వైరస్‌ కేవలం లైబీరియా, గినియా, సియోర్రా లియోన్‌, నైజీరియా దేశాలకు మాత్రమే పరిమితమైంది. అయితే మన దేశానికి కూడా ఇది ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ఎందుకంటే ఇబోలా వైరస్‌ వ్యాపించిన దేశాల్లో దాదాపు 45 వేల మంది భారతీయులు పనిచేస్తున్నారు. అక్కడ పరిస్థితి మరీ విషమిస్తే వీరందరినీ వీలైనంత త్వరగా వెనక్కి రప్పించాలని యోచిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ పార్లమెంటులో తెలిపారు. గినియాలో 500 మంది, లైబీరియాలో 3 వేల మంది, సియోర్రా లియోన్‌ లో 1200 మంది, నైజీరియాలో అయితే ఏకంగా 40 వేలమంది భారీయులు ఉన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా 300 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బంది లైబీరియాలో పనిచేస్తున్నారు. ఇప్పటికే 1603 మందికి ఇబోలా వైరస్‌ సోకిందని, వారిలో 887 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నేపథ్యంలో భారతీయులకు కూడా పరిస్థితి ప్రమాదకరంగానే కనిపిస్తోంది. భారతీయుల్లో ఎవరికైనా ఈ వైరస్‌ సోకి, అది తెలియకుండా వాళ్ళు స్వదేశానికి తిరిగి రావాలని భావిస్తే పరిస్థితి ఏంటని మన అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి భారతదేశానికి వ్యాపించకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ వ్యాధి తీవ్రంగా ఉన్న దేశాల నుంచి ఎవరెవరు భారతదేశానికి వస్తున్నారు, వాళ్ల తుది గమ్యం ఎక్కడ అనే విషయాలను ముందుగానే తెలుసుకుంటోంది. కానీ అమెరికా, ఇంగ్లండ్‌ లాంటి దేశాల్లో ఇబోలా బాధితులకు ఉన్న చికిత్స సదుపాయాలు మాత్రం ఇంతవరకు భారత్‌ లో లేవు. అవి కూడా వస్తే తప్ప భారతీయులకు ఈ వైరస్‌ నుంచి పూర్తి రక్షణ లభించినట్లు చెప్పలేం.

Tag:‘Pepsi’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *