వ్యక్తి మృతి..బంధువుల అందోళన.

హైదరాబాద్ ముచ్చట్లు:
హబ్సిగూడ గాంధీ గిరిజన బస్తీలో భీకు నాయక్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు.  న్యాయం చేయాలంటూ ఓయూ   పి.ఎస్ ముందు భార్య, బంధువులు ఆందోళన దిగారు. మొదటిభార్య బంధువులే తన భర్తను హత్య చేసి ఉంటారని రెండవ భార్య అనుమానం వ్యక్తం చేసింది. హాబ్సి గూడ గాంధీ గిరిజన బస్తీలో నివాసముంటు స్థానికంగా ప్రైవేట్ స్కూల్ లో బస్ డ్రైవర్ గా పని చేస్తున్న మృతుడు నిన్న సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఫోన్ రావడంతో బయటకు వెళ్ళాడు. చీకటి పడ్డ ఇంటికి రాక పోవడం తో బార్య హారిక చుట్టు పక్కల వెతికి పొలీస్ లకు పిర్యాదు చేసింది. అయితే ఈ రోజు ఉదయం బస్తీ సమీపంలో నిలిపి ఉన్న అటో లో తలకు గాయాలతో పడి పోయి ఉండడంతో అక్కడున్న వారు చూసి పొలీస్ లకు సమాచారం ఇచ్చారు. అయితే అప్పటీకే అతను మృతి చెంది ఉండడంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
 
Tags:Person killed..relatives worried

Natyam ad